»Last Chance For Aadhaar Update Fees Must Be Paid After 14
Aadhar Update: ఆధార్ అప్డేట్కు చివరి అవకాశం..14 తర్వాత ఫీజు చెల్లించాల్సిందే!
ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు మరో 10 రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆధార్‌లో మార్పులు చేసుకునేవారు కచ్చితంగా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని యూఐడీఏఐ వెల్లడించింది.
ఆధార్ అప్డేట్ (Aadhar Update) చేసుకోవాలని కేంద్రం పదే పదే చెబుతున్నా ఇప్పటి వరకూ చాలా మంది అప్డేట్ చేసుకోలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, బ్యాంకులకు, అన్ని పనులకు ఇప్పుడు ఆధార్ తప్పనిసరి. భారతదేశంలో మొదటి గుర్తింపు కార్డుగా ఆధార్‌ను వినియోగిస్తున్నారు. అటువంటి ఆధార్ కార్డును 10 సంవత్సరాలుగా అప్డేట్ చేసుకోని వారు కచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని కేంద్రం తెలిపింది.
ప్రస్తుతం ఈ ఆధార్ అప్డేట్ సేవలను ఉచితంగా పొందేందుకు సెప్టెంబర్ 14వ తేది వరకూ అవకాశం ఇచ్చింది. అప్పటి వరకూ ఎవ్వరైనా ఛార్జీ లేకుండా ఆధార్ సేవలను పొందొచ్చు. సాధారణంగా ఆధార్ వివరాలను మార్పు చేసేందుకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) రూ.50 వరకూ ఛార్జ్ చేస్తుంది. అయితే ఈ ఛార్జ్ మరో 10 రోజుల పాటు ఉండవు.
ఆధార్ కార్డు (Aadhar Update)లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, సంవత్సరం, మొబైల్ నంబర్, ఈమెయిల్ వంటి మార్పులను రూపాయి చెల్లించకుండా ఆన్లైన్లో సరిచేసుకోవచ్చు. సెప్టెంబర్ 14వ తేది వరకూ ఈ సేవలన్నీ ఉచితంగా పొందొచ్చని యూఐడీఏఐ వెల్లడించింది. అయితే ఆధార్‌లో ఫో లేదా ఐరిష్, బయోమెట్రిక్ వివరాలను మార్చుకోవాలనుకుంటే మాత్రం అందుకోసం కచ్చితంగా దగ్గర్లోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారు ఫీజులను కూడా చెల్లించాల్సి ఉంటుందని యూఐడీఏఐ (UIDAI) ప్రకటించింది.
బయోమెట్రిక్ (Biometric) వివరాలను అప్డేట్ చేయాలంటే కొంత సమయం పడుతుది. వచ్చిన వ్యక్తి డెమోగ్రాఫిక్ వివరాలను ఆధార్ సెంటర్ (Aadhar centre) సిబ్బంది తీసుకుంటారు. అందుకోసం అభ్యర్థి కొంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఆధార్ డేటాబేస్ లోని సమాచారం తాజాగా ఉండేందుకు ప్రతి పదేళ్లకు ఒకసారి తమ ఆధార్ వివరాలను అందరూ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని యూఐడీఏఐ సూచించింది. కాబట్టి అప్డేట్ చేసుకోని వారు ఉంటే ఈ 10 రోజుల్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవడం మర్చిపోకండి.