లైగర్ మూవీ పూరిని మళ్లీ డైలామాలో పడేసింది. ఈ సినిమా హిట్ అయి ఉంటే.. డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’తో పాటు.. ఇప్పటికే రాసుకున్న కథలతో.. పూరి పాన్ ఇండియా బండి జెట్ స్పీడ్‌తో దూసుకుపోయోది. కానీ ఇప్పుడు లైగర్ దెబ్బకు పూరికి గట్టి ఎదురుదెబ్బ పడింది. దాంతో పూరి వాట్ నెక్ట్స్.. అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పూరి నెక్ట్స్ హీరో ఫిక్స్ అయినట్టు టాక్. పూరికి హిట్స్, ఫ్లాప్స్ కొత్తేం కాదు. ఎగిసిపడే అల లాంటి వాడు పూరి.. అందుకే సాలిడ్‌గా బౌన్స్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో కొత్త కథతో రావాలా.. లేక ఏదైనా రీమేక్‌తో రావాలా అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లైన్లో ఉందని వినిపించినా.. తాజాగా ఓ రీమేక్ మూవీని ముందెసుకున్నట్టు సమాచారం. అది కూడా పూరి కొడుకుతో అని తెలుస్తోంది.
పూరి కొడుకు అని కాకుండా.. హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు ఆకాష్ పూరి. పూరి కూడా గతంలో కొడుకును హీరోగా పెట్టి ‘మెహబుబా’ అనే సినిమా చేశాడు. అయితే ఇది ఆకాష్‌కు ఏ మాత్రం గుర్తింపు తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత రొమాంటిక్, చోర్ బజార్ వంటి సినిమాలు చేసినా పెద్దగా ఫలితం లేదు. దాంతో ఈసారి పెద్ద హీరోలతో రిస్క్ చేయకుండా.. కొడుకుతో ఓ రీమేక్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట పూరి. రీసెంట్గా ఓ కొరియన్ మూవీని చూసిన పూరి.. దాన్ని రీమేక్ చేయాలని ఫిక్స్ అయిపోయాడట. ప్రస్తుతం ఆ మూవీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. పూరి తన కొడుకుకు స్టార్ డమ్ ఇవ్వడమే కాదు.. దర్శకుడిగా డబుల్ ఫోర్స్‌తో బౌన్స్ బ్యాక్ ఇవ్వబోతున్నాడని చెప్పొచ్చు. మరి దీని పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.