ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా జీ సిరిస్(Motorola G series)లో నూతన ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మోటో జీ84 5జీ (Moto G84 5G) పేరుతో మూడు కలర్స్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. 50 ఎంపీ ప్రధాన కెమెరాతో ఈ ఫోన్ వస్తోంది. 5జీ నెట్వర్క్కి సపోర్ట్ చేస్తుంది. ఇక రేటు, ఫీచర్లు (Features) తెలుసుకుందాం ఇందులో 6.55 అంగుళాల 10 బిట్ పీఓఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి.
వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ (Megapixel) కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 8 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ కూడా ఉండనుంది.మోటో జీ84 5జీ (Moto G84 5G) ఫోన్ సింగిల్ వేరియంట్ (Variant) లో వస్తోంది. 12జీబీ+ 256జీబీ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.19,999గా కంపెనీ నిర్ణయించింది. వివా మెజెంటా, మార్ష్‌మల్లో బ్లూ రంగుల్లో ఫోన్ లభిస్తుంది. సెప్టెంబరు 8 మధ్యాహ్నం 12 నుంచి ఫ్లిప్‌కార్ట్(Flipkart)లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా లేదా ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజీ ఆఫర్ సాయంతో కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.