»Jabardast Hot Beauty Rithu Chowdary Wedding Video Viral
Rithu chowdary: జబర్దస్త్ హాట్ బ్యూటీ పెళ్లి నిజమేనా..వీడియో వైరల్!
జబర్దస్త్..ఈ బుల్లితెర ప్రోగ్రామ్ ఇప్పటికీ సెన్సేషనే. ఈ షో ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్స్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సుడిగాలి సుధీర్ అయితే హీరోగా కూడా రాణిస్తున్నాడు. ఇక చాలామంది ముద్దుగుమ్మలకు మంచి క్రేజ్ తీసుకొచ్చింది జబర్దస్త్ షో. వారిలో హాట్ బ్యూటీ రీతూ చౌదరి కూడా ఒకరు. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Jabardast hot beauty rithu chowdary wedding video viral
జబర్దస్త్ షోలో ఉన్న వారంతా ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్నారు. ఈ షో ద్వారా చాలామంది ఫేమస్ అయ్యారు. యాంకర్లు మొదలుకొని కమెడియన్స్ అందరికీ సినిమా ఆఫర్లు వస్తున్నాయి. సుడిగాలి సుధీర్ హీరోగా, హైపర్ ఆది కమెడియన్గా, వేణు దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ లిస్ట్ చెప్పుకుంటా పోతే చాలా పెద్దగా ఉంటుంది. కొందరు బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్లి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం హాట్ బ్యూటీ రీతూ చౌదరి(rithu chowdary) హవా నడుస్తోంది. ఈ బోల్డ్ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కిర్రెక్కించేలా ఉంటాయి. అమ్మడు నెట్టింట్లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికే బుల్లితెరపై ఎన్నో షోలు చేసింది. దాంతో రీతూ చౌదరికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
అయితే తాజాగా ఈ బ్యూటీ పెళ్లి వీడియోని షేర్ చేసి షాక్ ఇచ్చింది. అమ్మడు దీనికి ఇచ్చిన క్యాప్షన్ చూడకుండా వీడియో చూస్తే ఆమెనే పెళ్లి కూతురు అని అనుకుంటున్నారు. ఎందుకంటే పెళ్లికూతురిగా(bride) మంగళ స్నానం చేస్తున్న వీడియో అది. కానీ అసలు మ్యాటర్ వేరే ఉంది. బుల్లితెర షో కోసమే రీతూచౌదరి మంగళ స్నానం చేసింది. ఆన్ స్క్రీన్ పెళ్లి చాలా బ్యూటీఫుల్ గా ఉంటుంది అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చింది రీతూ చౌదరి. దీంతో మల్లెమాల సంస్థ వారు సుధీర్, రష్మీ గౌతమ్ తర్వాత ఇప్పుడు రీతూ చౌదరి పెళ్లి చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(social media)లో తెగ వైరల్ అవుతోంది.