ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అన్ని విధాలా సమాయాత్తమౌతోంది. ఎవరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయోలో ఇప్పటి నుంచే చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ నియోజకవర్గం విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే… అక్కడి నుంచి పోటీచేసినా ఫలితం ఏమీ దక్కలేదు. అంతేకాకుండా… ఆ నియోజకవర్గాన్ని పార్టీ నేతలంతా వీడుతూ వస్తున్నారట. లోకేష్… నియోజకవర్గంలో పార్టీ గుర్తింపు కోసం ఎంత కష్టపడుతున్నా ఫలితం లేకుండా పోతోందట. అందుకే… లోకేష్ రాజకీయ భవిష్యత్తును ఆలోచించి చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మంగళగిరి కాకుండా లోకేశ్ పోటీ చేయడానికి బెస్ట్ ఆప్షన్ ఏదనే ప్రశ్నకు హిందూపురం పేరు సమాధానంగా వినిపిస్తోంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హిందూపురంకు ఎమ్మెల్యేగా ఉన్నారు. హిందూపురం నుంచి పోటీ చేయాలని లోకేశ్ నిర్ణయం తీసుకుంటే మాత్రం బాలయ్య తన సీటును త్యాగం చేయక తప్పదు. చాలా సంవత్సరాల నుంచి హిందూపురంలో తెలుగుదేశంకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అక్కడ తెలుగుదేశం నుంచి ఎవరు పోటీ చేసినా గెలవడం గ్యారంటీ అని చాలామంది భావిస్తారు.
లోకేశ్ హిందూపురం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తే బాలయ్య మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో లేక పోటీకే దూరంగా ఉంటారో చూడాల్సి ఉంది. అయితే హిందూపురం నుంచి లోకేశ్ పోటీ చేస్తే మాత్రం వైసీపీ నుంచి విమర్శలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.