నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు నన్ను రెచ్చగొడుతున్నారు. నాతో పెట్టుకోవద్దు మీకే మైనస్ నా కేడర్‌కు చెబితే మీలో ఒక్కరు కూడా బయట తిరగరని ఆయన అన్నారు. ఒక్కొక్కరిని కాల్చిపడేస్తా అని నేను తలుచుకుంటే కాంగ్రెస్ (Congress) చేయి ఊడిపోతుందని అని ఆయన హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ (Nagarkurnool) నియోజకవర్గంలోని తెల్కపల్లి మండలంలో ‘పదేళ్ల ప్రజా ప్రస్థానంలో మర్రన్న’ పాదయాత్ర సందర్భంగా జనార్దన్‌రెడ్డి మాట్లాడారు.
తనకు పిచ్చి లేస్తే కాల్చి పారేస్తానని అన్నారు. తనతో పెట్టుకుంటే కాంగ్రెస్ నేతలకే నష్టమని వార్నింగ్ ఇచ్చారు. జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. 2014, 2018 ఎన్నికల్లో మర్రి జనార్ధన్ రెడ్డి నాగర్ కర్నూల్ నుంచి వరుసగా రెండు సార్లు గెలుపొందారు. ఇటీవల కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల జాబితాలో కూడా ఆయనకు చోటు దక్కింది. మర్రి మాట్లాడుతుండగా పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయన కోపంతో ఊగిపోయారు.