»Bhopal Madhya Pradesh Cm Shivraj Singh Chouhan Inaugurated The Metro Model Coach
MetroInMP: మెట్రోను ప్రారంభించిన సీఎం..స్థానికుల సంతోషం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ మెట్రో రైల్ కోచ్‌ను ఈ రోజు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రారంభించారు. సెప్టెంబర్‌లో మరో నాలుగు కిలోమీటర్ల ట్రయల్ రన్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్రం మెట్రో వేగంతో అభివృద్ధి సాధిస్తుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు.
Bhopal, Madhya Pradesh CM Shivraj Singh Chouhan inaugurated the metro model coach
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మెట్రో(Bhopal Metro) ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం నవంబర్ 2018లో మంజూరు చేసింది. దాదాపు 57 నెలల తర్వాత నేడు భోపాల్‌లో ట్రయల్ రన్ ప్రారంభించారు. భోపాల్ మెట్రో, మోడల్ కోచ్‌ను(metro model coach) మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్(Shivraj Singh Chauhan) శనివారం ఈ మేరకు ఆవిష్కరించారు. పట్టణంలోని శ్యామలా హిల్స్ వద్ద స్మార్ట్ పార్క్ వద్ద మెట్రోస్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇది ప్రజల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని సీఎం తెలిపారు. భోపాల్ మెట్రో కోసం ప్రారంభ దశలో మూడు రైలు కోచ్‌లు ఏర్పాటు చేశామని..కోచ్‌లు ఒక్కొక్కటి 250 మంది ప్రయాణీకుల సీటింగ్ కెపాసిటీ కలిగి ఉంటాయని అన్నారు. సుభాష్ నగర్ డిపో నుంచి హబీబ్గ్యాంగ్ వరకు 4 కి.మీ వరకు సెప్టెంబర్‌లో ట్రయల్ రన్ జరగుతుందని వెల్లడించారు.
రాణి కమలపాటి మెట్రో రైల్వే స్టేషన్‌తో సహా మరో రెండు మెట్రో రైలు స్టేషన్లు సెప్టెంబర్‌లో ట్రయల్ రన్ కోసం పూర్తవుతాయని సీఎం చెప్పారు. మధ్యప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MPMRCL), భోపాల్, ఇండోర్ ప్రాంతాల్లో కొత్త మెట్రో ప్రాజెక్ట్‌లను అధికారిక అనుమతి ఇచ్చింది. రూ.3,200 కోట్ల రూపాయలతో ఫ్రెంచ్ మొబిలిటీ కంపెనీ భోపాల్, ఇండోర్ మెట్రో రైలు ప్రాజెక్టులకు కావాల్సిన వాటిని సరఫరా చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా విభాగం కింద గుజరాత్‌లోని సావ్లీ ప్లాంట్‌లో మెట్రో రైళ్ల ఉత్పత్తి పనులు జరుగుతున్నాయి. మొత్తం కాంట్రాక్ట్‌లో ఒక్కొక్కటి త్రి కార్ కాన్ఫిగరేషన్‌తో కూడిన 52 స్టాండర్డ్ గేజ్ మెట్రో ప్యాసింజర్ ట్రైన్సెట్ల డిజైన్, తయారీ, సరఫరా, ఇన్స్టాలేషన్, టెస్ట్, కమీషనింగ్ విభాగాలు ఉన్నాయి. ఈ క్రమంలో భోపాల్‌కు 27 రైళ్లు, ఇండోర్‌కు 25 రైళ్లను అందించనున్నారు. ఒక్కో కోచ్ పొడవు 22 మీటర్లు, వెడల్పు 2.9 మీటర్లుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
భోపాల్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ను కేంద్రప్రభుత్వం నవంబర్ 30, 2018న మంజూరు చేసింది. దాదాపు రూ.6,941.40 కోట్లతో మొత్తం రెండు కారిడార్లుగా ఈ ప్రాజెక్ట్ ను 27.87 కి.మీ. పొడవు నిర్ణయించారు. ఒకటి కరోండ్ సర్కిల్ నుంచి AIIMS వరకు, రెండవది భాద్భద స్క్వేర్ నుంచి రత్నగిరి కూడలి వరకు నిర్మించారు. దీంతో మధ్యప్రదేశ్ అన్ని రంగాల్లోనూ మెరుగవుతోందని, మెట్రో వేగంతో రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా ఎదిగి రాష్ట్ర ప్రజలకు కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయని ఈ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహన్(Shivraj Singh Chauhan) వెల్లడించారు.