ఓ పదేళ్ల బాలుడు విమానంలో బాంబు ఉందంటూ ఫోన్ చేశాడు. ఈ ఘటనే ముంబయి(Mumbai)లో జరిగింది.కొందరు ఆకతాయిలు ఫోన్ చేసి బెదిరించే సంఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. దీనివల్ల సిబ్బందితోపాటు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఫ్లైట్(Flight)లో బాంబు ఉందని పోలీసులకు బెదిరింపు కాల్ రావడంతో ముంబయి విమానాశ్రయంలోని సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయి పోలీసులకు ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. అయితే అత్యవసర హెల్ప్‌లైన్ కాల్ (Emergency call) అనుకుని ప్రధాన కంట్రోల్ రూమ్‌కు కనెక్ట్ చేశారు.
ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Chhatrapati Shivaji Maharaj International Airport) ఒక విమానంలో బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందించాడు. అంతేకాకుండా ఈ ప్రమాదం జరగకుండా ఆపడానికి పోలీసులను సహాయం కోరాడు. ఫోన్ కాల్ వచ్చిన వెంటనే పోలీసులు బాంబ్ స్క్వాడ్ (Bomb Squad) సహాయంతో అధికారులను అప్రమత్తం చేశారు. తనిఖీలు చేపట్టగా ఎక్కడా బాంబు కనిపించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.విమానాశ్రయంలో హైటెన్షన్ (Hypertension) నెలకొంది. ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉద్విగ్న క్షణాలను అనుభవించారు. బాంబు లేదని తెలియడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు. బాంబ్ ఫోన్ కాల్ ఎవరు చేశారు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా.. సతారా జిల్లా(Satara District)కు చెందిన ఓ పదేళ్ల బాలుడు చేసినట్లుగా గుర్తించారు. బాలుడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లనే కాల్ చేసినట్లు పోలీసులు (Police) వెల్లడించారు