»Neeraj Chopra Has Qualified For The World Athletics Final Paris Olympics
Neeraj Chopra: ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్‌కు నీరజ్ చోప్రా..పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత
ఒలింపిక్స్ విజేత, భారత జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫయర్స్ తొలి ప్రయత్నంలోనే నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనతో చెలరేగిపోయాడు.
భారత జావెలిన్ త్రో (Javelin Throw) ఆటగాడు నీరజ్ చోప్రా (Neeraj Chopra) మరోసారి సత్తా చాటాడు. అదిరిపోయే ప్రదర్శనతో అథ్లెటిక్స్ ఫైనల్‌కు చేరాడు. హంగేరి వేదికగా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ (World Athletics Championships) జరుగుతోంది. క్వాలిఫయర్స్ తొలి ప్రయత్నంలో నీరజ్ చోప్రా అత్యుత్తమ ప్రదర్శనతో చెలరేగాడు. ఆఖరికి ఫైనల్‌కు చేరుకున్నాడు.
మొదటగా క్వాలిఫైయింగ్ గ్రూప్-ఏలో నీరజ్ చోప్రా (Neeraj Chopra) పోటీపడి అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. తన ఈటెను 88.77 మీటర్లు విసిరాడు. ఫైనల్ చేరుకోవడానికి కటాఫ్ మార్క్ 83 మీటర్లు ఉండగా నీరజ్ చోప్రా అంతకుమించి ఈటెను విసిరి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. మరో జావెలిన్ త్రో అథ్లెట్ ఆటగాడు అయిన మను మొదటి రౌండ్లో 78.10 మీటర్లు తన ఈటెను విసిరాడు. రెండో ప్రయత్నంలో 81.31 మీటర్లు, మూడో ప్రయత్నంలో 72.40 మీటర్లు మాత్రమే ఈటెను విసరగలిగాడు.
ప్రస్తుతం గ్రూప్ – A (Group A)నుంచి నీరజ్ చోప్రా (Neeraj Chopra) క్వాలిఫై అయ్యాడు. జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 82.39 మీటర్లతో రెండో స్థానం, మను 81.31 మీటర్లతో ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నారు. నీరజ్ చోప్రా ఆటతీరుకు భారత ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో కూడా నీరజ్ చోప్రా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.