‘సలార్’ ఈ పేరు వింటే చాలు.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. తమ హీరోని ప్రశాంత్ నీల్ ఎలా చూపిస్తాడోనని.. ఊహకందని లెక్కలు వేసుకుంటున్నారు. కేజీఎఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో హై ఓల్టేజ్ పవర్ ఫుల్ మూవీ చేస్తున్నాడనేది వాళ్ల నమ్మకం. సలార్ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. సెప్టెంబర్ 28న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే సలార్ అయిపోయిన వెంటనే ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఆ తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇప్పుడు మరోసారి ప్రభాస్, ప్రశాంత్ నీల్ కలిసి భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతికి రిలీజ్ అయిన ‘వారసుడు’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దిల్ రాజు.. తన నెక్ట్స్ సినిమా ప్రశాంత్ నీల్‌తో ఉంటుందని చెప్పుకొచ్చారు. సినిమా టైటిల్ వచ్చేసి ‘రావణం’ అని వెల్లడించారు. కానీ హీరో పేరు మాత్రం చెప్పలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం.. రావణం ప్రభాస్దేనని ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే ఫిక్స్ అయిపోయారు. దాంతో రావణం ట్రైండింగ్‌లో ఉంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో.. భారీ పీరియాడికల్ డ్రామాగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక.. రావణం సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ రావడానికి చాలా సమయం పట్టినా.. ప్రశాంత్ నీల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అంటున్నారు. అయితే.. ‘రావణం’ మూవీ ప్రభాస్‌దేనా లేదా.. అనే విషయంలో క్లారిటి రావాల్సి ఉంది.