మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీలో స్వీటి అనుష్క గ్లామర్ రోల్ పోషించినట్టు తెలుస్తోంది. ఆ పాత్రలో ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే సందేహాం కలుగుతుంది.
విభిన్న కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ లో దూసుకుపోతున్న యువ హీరో నవీన్ పొలిశెట్టి. ఆయన హీరోగా, స్టార్ హీరోయిన్ అనుష్క జంటగా కలిసి నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి. ఈ సినిమాతో అనుష్క చాలా కాలం తర్వాత తెరపై కనిపించనుంది. అందులో అనుష్క లాంటి స్టార్ హీరోయిన్, యువ హీరో నవీన్ పొలిశెట్టితో చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి.
ట్రైలర్ చూసిన తర్వాత అనుష్క క్యారెక్టర్ కొంచెం తెలుస్తోంది. పిల్లలను కనడానికి పెళ్లి అవసరం లేదంటూ ఆమె చెప్పే డైలాగులు కొంచెం కన్ఫ్యూజన్ చేస్తున్నాయి. ఈ సినిమాలో అనుష్క కొంచెం బోల్డ్ రోల్ చేసినట్లు అర్థమౌతోంది. అసలు ఈ మూవీని కేవలం అనుష్క కోసమే ఎదురుచూసే వారు ఉన్నారు. చాలా కాలం తర్వాత అనుష్కను చూస్తున్నామని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తీరా ఆమె రోల్ ఏమో కొంచెం బోల్డ్ గా ఉంది.ఇప్పటి వరకు అనుష్క చాలా పాత్రలు చేసింది.. ఇలాంటివి రోల్ చేయలేదు. మరి ఆమెను ఈ పాత్రలో ఫ్యాన్స్ ఎంత వరకు రిసీవ్ చేసుకుంటారు అనే సందేహాలు ఉన్నాయి. సినిమా విడుదలైతే గానీ, రిజల్ట్ ఎలా ఉంటుంది అనే విషయం తెలియదు.
ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇప్పటి కే మూడుసార్లు వాయిదా పడిన మూవీ.. చివరగా సెప్టెంబర్ 7వ తేదీన రావడానికి సిద్దమైంది. సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తుండగా, నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడీయన్ గా కనిపిస్తున్నారు.
అన్విత రవళి శెట్టి పాత్రలో అనుష్క.. స్టాండప్ కమెడియన్ సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్ పొలిశెట్టి కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతోంది.. అసలు ఈ చిత్రంలో అనుష్క గ్లామర్.. నవీన్ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతున్నాయి అనే ఉత్కంఠ తీరాలి అంటే, మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే వరకు ఆగాల్సిందే.