»A New Electric Scooter From Tvs Motors 140 Km E Scooter
TVS Motor: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు.. 140 కి.మీ వెళ్లొచ్చు
టీవీఎస్ మోటార్ తన రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. ఇక స్కూటర్ భద్రత కోసం నెక్ట్స్-జెనరేషన్ ABS కూడా ఇచ్చారు.
A new electric scooter from TVS Motors. 140 km e-scooter
TVS Motor: మార్కెట్లో గుడ్‌విల్‌తో దూసుకుపోతున్న ప్రముఖ టూ విలర్ వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) తన రెండవ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. టీవీఎస్ ఎక్స్ (TVS X) పేరుతో ఇ-స్కూటర్‌ను (e-scooter) ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. నేవిగేషన్ సిస్టం, ఈవీ ఛార్జర్ మ్యాపింగ్ మెకానిజమ్, లైవ్ వెహికల్ లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లు ఈ స్కూటర్లో ఏర్పాటు చేసింది. ఈ వెహికిల్ మొత్తం అల్యూమినియం బాడీతో డిజైన్ చేశారు. దీని ఎక్స్ ఎక్స్‌షోరూం రూ.2.49 లక్షలుగా బెంగళూరు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి, నవంబర్ నుంచి డెలివరీలు మొదలు పెట్టనున్నట్లు టీవీఎస్ కంపెనీ పేర్కొంది.
ఈ ఎలక్ట్రిక్ వాహనం ఫీచర్స్ చూస్తే.. టీవీఎస్ ఎక్స్ స్కూటర్ 3.8 kWh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. 2.6 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 105 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేయవచ్చు. 3 kW ఫాస్ట్ ఛార్జర్‌తో అయితే కేవలం గంట వ్యవధిలో 50 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇక స్కూటర్ భద్రత కోసం నెక్ట్స్-జెనరేషన్ ABS కూడా ఇచ్చారు. స్టెల్త్, ఎక్స్‌ట్రైడ్, ఎక్సోనిక్ మోడ్స్ ఉన్నట్లు టీవీఎస్ తెలిపింది. ఈ స్కూటర్ కొనుగోలులో భాగంగా 950W పోర్టబుల్ ఛార్జర్‌ను రూ.16,275కే అందిస్తామని మోటార్ కంపెనీ తెలిపింది. 3-KW స్మార్ట్ హోమ్ ఛార్జర్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది. వెల్నెస్, గేమింగ్, బ్రౌజింగ్, లైవ్ వీడియో ఫీచర్లను అందించే ప్లే టెక్‌తో ఈ స్మార్ట్ స్కూటర్ వస్తోంది. ఈ ‘TVS X’ ను స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్, హెల్మెట్‌తో కనెక్ట్ చేయవచ్చు. ఇతరులు యాక్సెస్ చేయకుండా ఉండేందుకు స్మార్ట్ షీల్డ్ భద్రతా ఫీచర్ కూడా దీనిలో ఉంది.