నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని అనురాధ అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ అత్యవసర సమయంలో ఆమె కుటుంబానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు భారతి రూ. 18 వేల ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. వారు మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఉన్న విద్యార్థిని అనురాధ త్వరగా కోలుకుని, మళ్లీ పాఠశాలకు హాజరై తన విద్యాభ్యాసాన్ని విజయవంతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.