పాకిస్థాన్‌లోని లోయలను దాటేందుకు వినియోగించే కేబుల్ కారులో స్కూల్‌కు వెళ్లే ఆరుగురు చిన్నారులతో సహా ఎనిమిది మంది చిక్కుకుపోయారు. ఈ ఘటన పాక్ (Pakistan)లోని ఖైబర్ పఖ్తుంఖ్వా (Khyber Pakhtunkhwa) రాష్ట్రంలోని లోయలో ( Pakistani valley)= చోటు చేసుకొంది. కొండల మధ్య నుంచి స్కూలుకి వెళ్లేందుకు విద్యార్థులు చైర్లిఫ్టును వాడుతుంటారు.రోజులాగే ఈ రోజు లోయను దాటేందుకు చైర్లిఫ్టు ఎక్కారు. అందులో మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే, అది కొద్ది దూరం వెళ్లాక కేబుల్ పాడై మధ్యలోనే చైర్లిఫ్టు ఇరుక్కుపోయింది.
దాదాపు 1,200 అడుగుల (365 మీటర్లు) ఎత్తులో అది ముందుకు వెళ్లక, వెనక్కి రాకుండా ఉండిపోయింది. అందులో ఇరుక్కుపోయిన గల్ఫజ్ అనే వ్యక్తి పాకిస్థాన్ టెలివిజన్ ఛానెల్ (Television channel) జియో న్యూస్ తో ఫోనులో మాట్లాడుతూ తమను రక్షించాలని వేడుకున్నాడు. దాదాపు 5 గంటలుగా తమ ప్రాణాలు గాల్లోనే ఉన్నాయని తెలిపాడు. ఇప్పటికే చైర్లిఫ్టులోని ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడని అన్నాడు. ఓ హెలికాఫ్టర్ (Helicopter) వచ్చినప్పటికీ తమను కాపాడలేకపోతోందని చెప్పాడు. కేబుల్ కార్ కి ఒకే ఒక్క రోప్ ఉందని అధికారులు అంటున్నారు. వారికి కాపాడేందుకు పాక్ ఆర్మీ (Pak Army) నానా తిప్పలు పడుతోంది.‘దాదాపు 1200 అడుగుల ఎత్తులో వారంతా చిక్కుపోయారు. హెలికాఫ్టర్ లేకుండా వారిని కాపాడడం అసాధ్యం. అందుకోసం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వాన్ని హెలికాఫ్టర్‌ను పంపించాలని కోరాము’’ అని రెస్య్కూ అధికారి జుల్ఫికర్ ఖాన్ (Zulfikar Khan) తెలిపారు. దీంతో స్థానిక అధికారులు స్పందించారు.