మహేష్ కుటుంబం వ్యక్తిగతంగా ఈ మధ్య కాలంలో చాలా విధాలుగా నష్టపోయింది. మహేష్ బాబు అద్భుతమైన బ్లాక్బస్టర్లను అందించడం, బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం మాత్రమే కాకుండా కుటుంబ వ్యక్తిగా కూడా పేరు పొందాడు. అతను తన కుటుంబ సభ్యులు భార్య నమ్రత పిల్లలు గౌతమ్, సితారతో మాత్రమే కాకుండా తన సిబ్బందితో కూడా మంచి సంబంధాలు, బంధాన్ని పంచుకుంటాడు.
తాజా సమాచారం ప్రకారం మహేష్, అతని కుటుంబం వ్యక్తిగత నష్టంతో శోకసంద్రంలో మునిగిపోయారు. తమ పెంపుడు కుక్క ప్లూటో చనిపోయిందని మహేష్ భార్య నమ్రత పంచుకున్నారు. నమ్రత ఆమె ప్లూటో తో, ప్లూటో తో గౌతమ్, సితార మహేష్‌లతో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. అది చనిపోయినందుకు వారు చాలా బాధపడుతున్నట్లు ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు.
“మేము నిన్ను మా హృదయాలలో ఎప్పటికీ దాచుకుంటాం ప్లూటో” అని పోస్ట్ చేసింది. కాగా ఈ పోస్టుకి ఫ్యాన్స్ స్పందించారు. ప్లూటోని కోల్పోయినందుకు బాధపడవద్దని కామెంట్స్ చేస్తున్నారు. నటి డింపుల్ హయాతి స్పందిస్తూ ” మీకు, మీ కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ప్లూటో ఎప్పటికీ మీతోనే ఉంటాడు.” అని ట్వీట్ చేశారు. ఇప్పటికే మహేష్ తన తల్లి, తండ్రి, సోదరుడిని చాలా తక్కువ సమయంలోనే కోల్పోయాడు. ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు వారి పెంపుడు కుక్క కూడా చనిపోవడం బాధాకరం. కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ తన రాబోయే యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారంతో ప్రొఫెషనల్ ఫ్రంట్‌లో బిజీగా ఉన్నాడు. అంతే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. దాని కోసం కండలు పెంచుతున్నట్లు టాక్.