Lady Rebel Fan Hungama: చారిటీ కార్యక్రమాల ఫండింగ్ కోసం ఫ్యాన్స్ మూవీస్ రీరిలీజ్ చేస్తున్నారు. ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యోగి (yogi) మూవీని విడుదల చేశారు. 4కే క్వాలిటీతో రిలీజ్ చేయగా.. ఫ్యాన్స్ హంగామా చేశారు. ఓ చోట అయితే థియేటర్ స్క్రిన్ పగలగొట్టి రచ్చ రచ్చ చేశారు. మరో చోట డ్యాన్సులతో హోరెత్తించారు. థియేటర్లో ఒరొరి యోగి (yogi) అనే పాట రాగానే.. లేచి నిలబడి స్టెప్పులు వేశారు.
కింద కనిపిస్తోన్న వీడియోలో ఓ అమ్మాయి యోగి (yogi) మూవీలో పాట రాగానే జోష్గా డ్యాన్స్ చేసింది. ఒరొరి యోగి అనే పాటకు అనుగుణంగా స్టెప్పులు వేసింది. 38 సెకన్ల నిడివి గల వీడియోలో ఆమె ఎనర్జీ లెవల్స్ ఎక్కడ కూడా తగ్గలేవు. ముందు ఉన్న వారు పాటను చూస్తూ.. కొందరు వీడియో తీయగా.. మరికొందరు ఈలులు, కేకలతో థియేటర్లో సందడి నెలకొంది.
ఆ వీడియోకు ద లేడీ రెబల్ అనే ట్యాగ్ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ఆ అమ్మాయి డ్యాన్స్ (dance) చేసింది. జీన్స్, బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న ఆ అమ్మాయి.. పాటలో హీరోయిన్ మాదిరిగానే డ్యాన్స్ చేసింది. కాసేపటి తర్వాత స్క్రీన్ చూస్తూ మరీ స్టెప్పులు వేసింది. ఓ ప్రొఫెషనల్ డ్యాన్సర్ మాదిరిగా ఆడింది.