Chiru కన్నా పవన్ పెద్ద స్టారా..? భోళా కన్నా బ్రో కలెక్షన్స్ బెటర్ అవడంతో చర్చ
చిరు భోళా శంకర్ మూవీ కన్నా పవన్ కల్యాణ్ బ్రో మూవీ కలెక్షన్ల పరంగా దూసుకెళ్లింది. బ్రో మూవీకి నెగటివ్ టాక్, రివ్యూస్ వచ్చిన.. పవర్ స్టార్ ఇమేజ్ ముందు అవేమీ పనిచేయలేవు.
Pawan Kalyan: మెగా హీరోలు చిరంజీవి, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇద్దరూ రిమేక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పవన్ కల్యాణ్ బ్రో మూవీలో గెస్ట్ రోల్ చేశారు. అయినప్పటికీ ఆ సినిమా ఆడింది. మూవీలో గల ఓ పాటపై దుమారం రేగడంతో కలెక్షన్లు ఫర్లేదు. తర్వాత వచ్చిన చిరంజీవి భోళా శంకర్ డిజాస్టర్ అయ్యింది. ఫస్ట్ డే కలెక్షన్లు బోసిపోయాయి. అదే సమయంలో వచ్చిన రజనీ జైలర్ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
వాస్తవానికి బ్రో, భోళా శంకర్ రెండు సినిమాలు బయ్యర్లకు నష్టాలను మిగిల్చాయి. భోళా శంకర్ మూవీ కన్నా బ్రో సినిమా బెటర్. సినిమా అంటే హిట్, ఫ్లాప్ కామన్.. భోళా శంకర్ మూవీ మాత్రం డిజాస్టర్ అయ్యింది. ఇందుకు గల కారణం.. స్టోరీ, డైరెక్టర్.. పలు రకాల కారణాలు వినిపిస్తున్నాయి. అమెరికాలో భోళా శంకర్ 500కే డాలర్స్ కలెక్షన్స్ కూడా రాబట్టలేదు. పవన్ బ్రో మూవీ 1.4 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించింది. బ్రో మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గట్టిగా వచ్చాయి. దీంతో మూవీపై నెగిటివ్ ఇంపెక్ట్ అంతగా పడలేదు.
భోళా శంకర్ మూవీకి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. దీంతో చిరు మూవీకి నెగిటివ్ అయ్యింది. మెగాస్టార్ పేరు కూడా పనిచేయలేదు. బ్రో మూవీకి కూడా అలాంటి సమీక్షలే వచ్చాయి.. పవర్ స్టార్ ఇమేజ్, మూవీకి కాంట్రవర్సీతో కాస్త ఆదాయం అయినా వచ్చింది. ఇలా చూసుకుంటే మెగాస్టార్ కన్నా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పవర్ ఫుల్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. పవర్ స్టార్ అంటే పడి చచ్చే యువత చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు చిరంజీవికి క్రేజీ ఉండేది.. ఆ క్రేజ్ ఇప్పుడు పవన్ వైపు మళ్లిందని అనేవారు చాలా మందే ఉన్నారు.