తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. నారావారి పల్లెలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శంచారు. ప్రజా వ్యతరేక విధానాలతో ప్రభుత్వాలను నడపలేరని.. ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెప్తారని అన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా తెచ్చిన జీవో. నెంబర్ 1 కాపీలను భోగి మంటల్లో వేసి తగులబెట్టారు. అనంతరం నారావారి పల్లెలో టీడీపీ శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ప్రతి ఏడాది సంక్రాంతి సంబరాలను సొంతూరిలో జరుపుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సారి బాలకృష్ణ కుటుంబం కూడా నారావారిపల్లెలోనే సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే రెండు కుటుంబాలు నారావారిపల్లెకు చేరుకున్నాయి. మళ్ళీ రాష్ట్రానికి మంచిరోజులు వస్తాయి. పుంగనూరులో పది రోజుల్లో వందలాది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఈ పండగగా పూట మావాళ్ళు జైల్లో ఉన్నారు. ఈ పాపం ఊరికే పోదు..అని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని లెక్కలు రాస్తున్నా వచ్చే పండక్కి ఎక్కడ ఉంటావో పెద్దిరెడ్డి చూసుకో అంటూ మంత్రి పెద్దిరెడ్డిని హెచ్చరించారు.