అన్‌కన్‌ఫ్యూజ్ మి విత్ బిల్ గేట్స్ పేరుతో బిల్ గేట్స్ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. రెండో ఎపిసోడ్లో ఎన్జీవో సంస్థ ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు సాల్ ఖాన్‌తో మాట్లాడారు. సల్మాన్ ఫోటో చూపిస్తూ.. ఇతని గురించి మీకు తెలుసా..? ఇతని పేరు వల్ల మీరు ఇబ్బందికి గురయ్యారా అని అడిగారు.
Bill Gates: మెక్రోసాప్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ (Bill Gates) తన చేతిలో సల్మాన్ ఖాన్ ఫోటో పెట్టుకుని కనిపించారు. ఎంటా అని ఆరా తీస్తే.. ఆయన పాడ్ కాస్ట్లో చేసిన ఇంటర్వ్యూలో ప్రదర్శించారని తెలిసింది. ఇటీవల బిల్ గేట్స్ (Bill Gates) సొంతంగా పాడ్ కాస్ట్ ప్రారంభించారు. ‘అన్ కన్ఫ్యూజ్ మి విత్ బిల్ గేట్స్’ పేరుతో ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారు. రెండో ఎపిసోడ్లో ఎన్జీవో సంస్థ ఖాన్ అకాడమీ ఫౌండర్ సాల్ ఖాన్‌ను (sal khan) ఇంటర్వ్యూ చేశారు.
ఏంటీ, నేపథ్యం.. పర్సనల్ లైఫ్ గురించి బిల్ గేట్స్ (Bill Gates) అడిగారు. తర్వాత సల్మాన్ ఖాన్ ఫోటో చూపిస్తూ.. ఎప్పుడైనా వెబ్‌లో సెర్చ్ చేసిన సమయంలో ఇతను కనిపించి ఉంటారు కదా అని అడిగారు. అవును అంటూ సాల్ ఖాన్ స్పందించారు. బిల్ గేట్స్ (Bill Gates), సాల్ ఖాన్ (sal khan)vఇద్దరూ నవ్వుకున్నారు. సల్మాన్ వల్ల కన్ ఫ్యూజ్ కావాల్సి వచ్చిందా అని అడిగారు. తన అకాడమీ ప్రారంభించిన తొలినాళ్లలో సల్మాన్ ఖాన్ అభిమానుల నుంచి మెయిల్స్ వచ్చాయని వివరించారు.
మీరంటే ఇష్టం అని.. మీరు మ్యాథ్స్ కూడా చేయగలరని తనకు తెలియదని అందులో రాశారని వివరించారు. సల్మాన్ అనుకుని తనకు మెయిల్స్ పంపేవారని సాల్ ఖాన్ (sal khan) చెప్పారు. సల్మాన్‌తో తనకు ఉన్న పరిచయం గురించి కూడా సాల్ ఖాన్ ఇంటర్వ్యూలో వివరించారు. 2015లో భారత్ వెళ్లిన సమయంలో సల్మాన్‌తో కలిసి టీవీ కార్యక్రమంలో పాల్గొన్నానని వివరించారు. సాల్ ఖాన్ (sal khan) కూడా ఇండియాకు చెందిన వారే.. బెంగాళి అతని మాతృ భాష. హిందీ మాట్లాడటం వచ్చు అని ఇంటర్వ్యూలో వివరించారు. సాల్ ఖాన్ (sal khan) భార్య పాకిస్థాన్‌కు చెందిన వారని పేర్కొన్నారు.