ఆషాఢం, అధిక శ్రావణ మాసం(Sravana month)తో 2 నెలల విరామం తర్వాత ఈనెల 19 నుంచి డిసెంబర్ 31 వరకు 53 మంచి ముహూర్తాలున్నట్లు పండితులు తెలుపుతున్నారు. దీంతో వివాహాలు (Marriages), గృహ ప్రవేశాలు, శుభకార్యాలు జోరందుకోనున్నాయి. రెండు నెలల నుంచి శుభకార్యాలకు బ్రేక్ పడింది. ఆషాఢం, అధిక శ్రావణం కారణంగా రెండు నెలలు ఎటువంటి శుభకార్యాలు జరగడం లేదు. అయితే శ్రావణ మాసం వస్తుండడంతో.. శుభకార్యాలయాల సందడి కూడా ప్రారంభం కానుంది. శుభ కార్యాల నిర్వహణకు జనాలు రెడీ అయిపోతున్నారు. ఐదు నెలల పాటు దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు.
ఆగష్టు 19 నుంచి డిసెంబర్ 31 వరకు మొత్తం 53 ముహూర్తాలు (Moments) ఉన్నాయని తెలిపారు.ఈ ఏడాదిలో మొత్తం 104 దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. అందులో ఇప్పటికే 51 పూర్తయ్యాయి. ఈ నెల 19 నుంచి డిసెంబర్ 31 వరకు 53 దివ్యమైన ముహూర్తాలు మిగిలి ఉన్నాయి. నవంబర్, డిసెంబర్లో ఒక్కో నెలలో 14 ముహూర్తాలు ఉన్నాయి. గడిచిన మూడేళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో ముహూర్తాలు ఈ ఏడాదిలోనే ఉన్నాయి. ఆగష్టు నెలలో 19, 20, 22, 24, 26, 29, 30, 31 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఇక సెప్టెంబర్‌లో 1,2,3,6,7,8 తేదీల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. ఇక అక్టోబర్‌లో 18, 19, 20, 21, 22, 24, 25, 26, 27, 31 తేదీల్లో.. నవంబర్‌లో 1, 2, 8, 9, 16, 17, 18, 19, 22, 23, 24, 25, 28, 29 తేదీల్లో.. డిసెంబర్లో 3, 5, 6, 7, 8, 14, 15, 16, 17, 19, 20, 21, 24, 31 తేదీల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు వెల్లడించారు.
మరో వారం నాలుగైదు, రోజుల్లో దివ్యమైన ముహూర్తాలు ప్రారంభమవుతుండడంతో.. జనాలు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. అటు కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హోల్స్ (Function halls) కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. అయితే ముహూర్తాల సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని.. కొందరు రెండు, మూడు నెలల ముందే ఫంక్షన్ హాల్స్‌ను బుక్ చేసుకొని పెట్టుకున్నారు. అలాగే ఆటు ఆలయాల్లో కూడా పెళ్లిళ్లు.. ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునే వాళ్లు.. ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకుంటున్నారు.పెళ్లిళ్లతో మండపాలు కళకళలాడనున్నాయి. డీజే సౌండ్లు(DJ sounds), బరాత్ లతో వీధులు హోరెత్తనున్నాయి. ఇక, ఇప్పటికే కల్యాణ మండపాలకు అడ్వాన్సులు కూడా ఇచ్చేస్తున్నారు. పెళ్లి కార్డులు, పెళ్లి బట్టల షాపింగ్ చేస్తున్నారు. దీంతో ఫొటోగ్రాఫర్లు(Photographers), ట్రావెల్స్, పెళ్లిమండపాలు, పురోహితులు, బ్యాండ్ మేళం వాళ్లకు ఉపాధి దొరుకుతోంది.