కేంద్రమంత్రి స్మృతిఇరానీ(Smriti Irani) సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. వ్యాపారవేత్త జుబిన్ ఇరానీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తన ఇన్స్టాగ్రామ్(Instagram)లో స్మృతి తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్లో ఆమె పాల్గొన్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. అయితే ఓ నెటిజన్ (Netizen) చాలా చికాగు కలిగించే ప్రశ్న వేశారు. వ్యక్తిగత జీవితానికి చెందిన ప్రశ్న వేసినా.. మంత్రి చాలా ధైర్యంగా ఆ ప్రశ్నకు బదులిచ్చారు. మీరు మీ చిన్ననాటి స్నేహితురాలి భర్తను పెళ్లి చేసుకున్నారా అని ఓ సోషల్ మీడియా(Social media)యూజర్ అడిగాడు.
ఆ ప్రశ్నకు మంత్రి స్మృతి ఇరానీ ఏమాత్రం ఇబ్బందిపడలేదు. ఆ రూమర్లకు చెక్ పెడుతూ.. జుబిన్ ఇరానీ మొదటి భార్య మోనా(Mona) .. తన కన్నా 13 ఏళ్లు చిన్నదని చెప్పారు. కాబట్టి తమ ఇద్దరికీ ఎటువంటి ఫ్రెండ్షిప్ లేనట్లు వెల్లడించారు. మోనా తన చిన్ననాటి స్నేహితురాలు కాదన్నారు. ఆమె ఫ్యామిలీ వ్యక్తి అని, రాజకీయాలకు లింకులేదన్నారు. ఆమెను ఇందులోకి లాగవద్దు అని, తనతో వాదించండి అని ఆ నెటిజన్(Netizen)కు మంత్రి సమాధానం ఇచ్చారు. ఆమెను గౌరవించాలని మంత్రి తన సమాధానంలో కోరారు. పార్సీ వ్యాపారవేత్త అయిన జుబిన్‌ను 2001లో స్మృతి ఇరానీ పెళ్లి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్మృతి ఇరానీని తన టీవీ లైఫ్ గురించి కూడా ప్రశ్నించారు. రీల్ లైఫ్‌ను మిస్ అవుతున్నారా? అని అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. రీల్ లైఫ్ (Reel life) వదిలేసే నాటికి అది చాలా అద్భుతంగా అనిపించింది. కానీ ఎప్పటికీ ఆలాగే ఉంటుందని చెప్పలేమని అన్నారు. కాలం ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి నేర్పిస్తోందని ఆమె చెప్పారు.