మీరు ‘ముతంజన్( Mutanjan )’ అనే ఫుడ్ గురించి వినన్నారా అప్పట్లో రాజవంశీకుల భోజనశాలలో ప్రధాన వండించే ఆహార పదార్థాలలో ఇదొకటి.16 వ శాతాబ్దంలోనే మొఘల్ పాలకుడు అక్బర్ (Akbar) ప్రధాన మంత్రి అబుల్ ఫజల్ తన రచనలలో ముతంజన్ గురించి ప్రస్తావించడం జరిగింది. మొఘల్ ఫీస్ట్ పేరుతో రాసిన ఓ పుస్తకంలో చరిత్రకారిణి సల్మా హుస్సేన్ కూడా మొఘల్ (Mughal) రాచ వంటశాలలో తయారయ్యే ముతంజన్ పులావ్ గురించి వివరించడం జరిగింది. భారతీయ మార్కెట్లలో అమ్ముడయ్యే వంటకాల్లో ముతంజన్ ప్రధానంగా ఉండేదట.దీన్ని కేవలం రాజుల వంటకంగా కాకుండా ప్రజలందరూ ఎక్కువగా ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్( Street food )గా చెప్పుకొనేవారట.
చక్కెర, బియ్యం (Rice), మాంసం కలిసిన అరబిక్ లేదా పర్షియన్ (Persian) ఇతర వంటకాల నుంచి ముతంజన్ పుట్టి ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.10వ శతాబ్దంలో అల్-వర్రాక్ రాసిన ‘అనల్స్ ఆఫ్ ది ఖలీఫ్స్ కిచెన్’ పుస్తకంలో స్పైసీ కిచెన్‌తో పాలలో వండిన రైస్ వంటకం గురించి వివరించడం జరిగింది. ఈ వంటకానికి చివరిగా తేనెను కలిపేవారట.ముతంజన్ అనే పదం పెర్సో-అరబిక్ పదం ముతజ్జన్ నుంచి వచ్చింది. అంటే పాన్‌లో వేయించిందని అని అర్థం.ముతంజన్‌ను మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన వంటకమని ఎక్కువ మంది భావిస్తూ ఉంటారు. మధ్య అరబ్ వంటల(Arab cuisine)లో ముతజ్జన్ అనే పిలిచే ఈ రకం వంట భారత్‌లో చక్కెర, బియ్యం, మాంసం మిశ్రమాలతో చేసే వంటకు కాస్త దగ్గరగా ఉంటుంది.
జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం పప్పులు(Almonds), మఖానా, కోవా, కుంకుమ పువ్వులతో ఈ రైస్ నోరూరిస్తూ ఉంది.కుంకుమ పూలు , సుగంధ ద్రవ్యాల సుగంధంతో కలిసి నెయ్యిలో వేయించిన బాదంలు, జీడిపప్పులు ఘుమఘుమలాడుతున్నాయి. ‘‘ఇదే ముతంజన్’’ అని ఖురేషి అన్నారు.బక్రీద్(Bakrid) సమయంలో ఈ ఫుడ్ తప్పనిసరిగా ఉండేదని ఆయన చెప్పారు.ముతంజన్ ఇప్పుడు దొరకడం చాలా కష్టంగా మారింది. ఎవరికైనా ఈ వంటకం లభించిందంటే దాన్ని చాలా గొప్ప విషయంగా భావిస్తారు.