వరల్డ్‌లో అత్యంత ఎత్తైన బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా(Burj Khalifa)పై దుబాయ్, పాకిస్తాన్ జెండా ప్రదర్శించలేదు. దీంతో పాక్ జనం అవమానంగా ఫీలయ్యారు. పాక్ స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా ఈ ఏడాది 2716.5 అడుగుల ఎత్తైన ఈ భవనంపై పాకిస్తాన్ జెండాను ప్రదర్శిస్తారని పాకిస్తానీయులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీంతో అక్కడికి వచ్చిన పాకిస్తానీయులు నిరశాకకు గురయ్యారు. ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటుంది. ఈ వేడుకల సందర్భంగా, భవనంపై పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడానికి బుర్జ్ ఖలీఫా కమిటీ పూర్తిస్థాయిలో నో చెప్పింది. ఈ ఏడాది అస్సలు ప్రదర్శించేది లేదని తేల్చి చెప్పింది. అయినా, అక్కడికి పెద్ద ఎత్తున పాకిస్తానీ జనం చేరుకున్నారు.
ఈ మొత్తం ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా(Social media)లో వైరల్ అవడంతో పాకిస్తాన్ పేరుతో నెటిజనం రకరకాల జోకులు పేల్చుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇది వందలాది పాకిస్తానీయులు అక్కడి చేరుకుని ఆ నిమిషం కోసం వేచియున్నారు. కౌంట్ డౌన్ (Count down) మొదలు పెట్టారు.. కౌంట్ డౌన్ ముగిసినా ఆ భవనంపై ఎలాంటి లైట్లు రాకవడంతో పాకిస్తానీయులు షాక్ అయ్యారు. వారు దీనిపై చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంపై 12 గంటల తర్వాత ఒక్క నిమిషం కూడా తాము అనుకున్నది చూడకపోవడంతో పాకిస్తానీయులు(Pakistanis) ఆశ్చర్యపోయారు. దీని తరువాత, నిరాశ చెందిన ప్రజలు పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ ఘటనతో పాకిస్థానీలు తీవ్ర నిరాశకు లోనైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.