ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డెహ్రాడూన్ (Dehradun) సమీపంలో డూన్ డిఫెన్స్ కళాశాల భవనం కుప్పకూలింది. హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో కుండపోత వానలకు ఏడుగురు దుర్మరణం చెందారు. సోలన్ జిల్లాలో ఒక్కరాత్రి కుంభవృష్టిగా కురిసిన వాన బీభత్సం సృష్టించింది. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా ఏడుగురు మృతి చెందారు. సోలన్ జిల్లా కందఘాట్ సబ్ డివిజన్ జడోన్ గ్రామంలో క్లౌడ్ బరస్ట్ అయినట్లు అధికారులు వెల్లడించారు. సోలన్ జిల్లాలో ఒక్కరాత్రి కుంభవృష్టిగా కురిసిన వాన బీభత్సం (Rain disaster) సృష్టించింది.
కందఘాట్ సబ్ డివిజన్లోని జాడోన్ గ్రామంలో కుండపోత వాన కారణంగా ఏడుగురు మరణించారు. వరదల్లో రెండు ఇండ్లు, ఒక గోశాల కొట్టుకుపోయాయి.24 గంటల వ్యవధిలో హిమాచల్ ప్రదేశ్ లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిమ్లా (Shimla)- ఛండీఘడ్ రోడ్డును అధికారులు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా నేడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. సీఎం సుకు (CM Suku) చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ, అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలన్నారు. వరదలు, వర్షాలతో ధ్వంసమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఎలక్ట్రిసిటీ(Electricity), నీటి సమస్య ఉన్న చోట వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు.