»Kcr Congress Leaders Said Postponement Of Group 2 Exam In Telangana Dont Do Palabhishekam
Telangana Group 2 Exam: వాయిదా..KCRకు పాలాభిషేకాలు చేయోద్దు
రాష్ట్రంలో ఉద్యోగార్థులు, రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి పెరగడంతో గ్రూప్-2 పరీక్షను ఈ ఏడాది నవంబర్‌కు వాయిదా వేశారు. సీఎం ఆదేశం మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి TSPSC సెక్రటరీ, ఇతర అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మాత్రం కేసీఆర్ కు పాలాభిషేకం చేయోద్దని కోరుతున్నారు. ఎందుకో ఇక్కడ చుద్దాం.
KCR congress leaders said Postponement of Group 2 Exam in telangana Don't do Palabhishekam
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేశారు. ఉద్యోగార్థుల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ శనివారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)ని ఆదేశించారు. గ్రూప్ 2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ శాంతికుమారికి తెలిపారు. అంతేకాదు భవిష్యత్తులో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు సక్రమంగా ఉండేలా చూడాలని కూడా ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శికి సూచించారు. ఈ క్రమంలో గ్రూప్-2 ఎగ్జామ్ ను నవంబర్ నెలకు వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ అంశంపై శనివారం పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు ట్వీట్ చేస్తూ.. లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టిఎస్‌పిఎస్‌సితో సంప్రదింపులు జరిపి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని చీఫ్ సెక్రటరీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగార్థులు అర్హత గల అన్ని పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన సమయం ఉందని అందుకోసం ప్రిపేర్ కావాలని సూచించారు.
మరోవైపు తెలంగాణలో నిరుద్యోగుల తరఫున కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి.TSPSCని ముట్టడించడం సహా ఆందోళన చేయడంలో తమ పార్టీ నేతలు మద్దతుగా నిలిచారని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. అంతేకాదు సీఎం కేసీఆర్ ఆందోళనలు చేస్తే తప్ప అభ్యర్థుల కష్టాలు తెలియలేదా అంటూ నేతలు ప్రశ్నించారు. అంతేకాదు మరోవైపు గ్రూప్ 1 సహా పలు ప్రశ్నపత్రాల లీకేజీ కేసు ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. దానిపై ఏ అంశం కూడా మీడియా ప్రస్తుతం ప్రస్తావించడం లేదన్నారు. అసలు ఆ కేసు పరిస్థితి ఎంటని ప్రశ్నించారు. ఇంతవరకు ఎంత మందిని అరెస్ట్ చేశారు. ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. ఇలాంటి నేపథ్యంలో ఉద్యోగార్థులు కేసీఆర్ ఫొటోలను పాలిభిషేకాలు చేయోద్దని కాంగ్రెస్ నేతలు కోరారు. మరోవైపు పంచాయతీ ఉద్యోగులు జీతాల కోసం ఆందోళన చేసినా పట్టించుకోవడం లేదని గుర్తు చేశారు. కానీ కొంత మందికి మాత్రం లక్షల రూపాయలు ఇస్తూ ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.