»Andhra Pradesh Bapatla District Adnaki Si Raped A Young Woman
Police: యువతికి మత్తు మందు ఇచ్చి పోలీస్ అత్యాచారం
కాపాడాల్సిన పోలీసు అధికారే కామంతో ప్రవర్తించాడు. పుట్టినరోజని ఉందంటూ ఓ యువతిని ఇంటికి పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆపై వీడియోలు కూడా తీసి ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. అయితే యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Andhra Pradesh, Bapatla district Adnaki SI raped a young woman
Police: రక్షించాల్సిన వారే భక్షించడం అంటే ఇదేనేమో. ప్రజలను కాపాడాల్సిన బాధ్యతగల పోలీసు(Police) ఆఫీసర్ తన పుట్టినరోజు వేడుకకు ఓ యువతిని ఇంటికి పిలిపించి, మత్తుమందు ఇచ్చి అత్యాచారాని(Rape)కి పాలుపడినట్లు బాధితురాలు పేర్కొంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), బాపట్ల(Bapatla) జిల్లా అద్దంకి(Addanki) పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో చోటు చేసుకుంది. యువతి ఇచ్చిన వివరాలతో నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ బి.రమేష్‌బాబు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం..
నిందితుడు గతంలో అద్దంకి మండల పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్లో సమందర్‌వలీ ఎస్సైగా(SI) పనిచేశారు. ఆ సమయంలో అతనితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లు స్నేహంగా మాట్లాడరని..ఆ క్రమంలో తాను కూడా నమ్మానని బాధితురాలు ఫిటిషన్లలో తెలిపింది. తరువాత తాను విధులు నిర్వర్తించే సమయంలో తనను పుట్టినరోజు పేరుతో ఇంటికి పిలిపించాడని.. ఆ తరువాత తనకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడని, అశ్లీల చిత్రాలు కూడా తీశాడని సదరు యువతి తెలిపింది. ఇంత జరిగిన తరువాత పెళ్లి చేసుకోవాలని వేడుకోగా, చంపుతానని బెదిరించినట్లు అద్దంకి పట్టణానికి చెందిన యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.