High Court order to give details on Medigadda pillar incident
High Court: ఇటీవల కురిసిన వర్షాలతో (rain) పదుల సంఖ్యలో జనం చనిపోగా.. అంటువ్యాధులు కూడా ప్రభలాయి. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో (high court) పిటిషన్ వేయగా.. శుక్రవారం విచారణ జరిగింది. ఇప్పటికే ఓ సారి వర్షాలు (rains), వరదల వల్ల జరిగిన నష్టంపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదిక అందజేసింది. దానిపై ధర్మాసనం అసంతృప్తి చేయగా.. రెండోసారి నిన్న సమర్పించింది. అందులో కూడా సరైన సమాచారం లేదు.
వరద బాధితులకు మంజూరు చేసిన రూ.500 కోట్లు (500 croes) ఎవరికీ ఇచ్చారు.. 49 మంది (49 people) చనిపోయారని.. ఆ కుటుంబాలకు ఎంత మొత్తం ఇచ్చారు..? వారికి ఏ విధమైన సాయం చేశారు. వరదల వల్ల అంటువ్యాధులు వ్యాప్తి చెందాయి. అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారని హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం అడిగింది. సాయానికి సంబంధించి సమగ్ర నివేదిన సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
వరదల వల్ల కొందరు ఇళ్లను కూడా కోల్పోయారు. వారికి ప్రభుత్వం సాయం చేయాల్సి ఉంది. గత నెల 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు (rains) కురిశాయి. ఇప్పటివరకు 51 మంది చనిపోతే.. ప్రభుత్వం మాత్రం 49 మంది చనిపోయారని ప్రభుత్వం తప్పుడు వివరాలు చెబుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని మృతదేహాలు ఇప్పటివరకు దొరకలేదని తెలిపారు. ప్రమాద సమయంలో హెల్ప్ లైన్ నంబర్లు లేకపోవడంతో నష్టం తీవ్రత ఎక్కువ ఉందని పేర్కొన్నారు. అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోలేదని.. అందుకే కళ్ల కలక, న్యూమోనియో, డయేరియా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలతో జనాలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.