Jailer: జైలర్ మూవీ డే1 కలెక్షన్లలో సరికొత్త రికార్డు
తమిళ్ స్టార్ రజినీకాంత్(rajinikanth) నటించిన జైలర్(jailer) మూవీ నిన్న విడుదల కాగా..బాక్సాఫీస్ వద్ద సరికొత్త కలెక్షన్ల రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం మొదటిరోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకోగా..దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమా ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిందో ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ హీరో రజినీకాంత్(rajinikanth) యాక్ట్ చేసిన జైలర్ మూవీ(jailer movie) గురువారం థియేటర్లలో రిలీజ్ కాగా..అదిరిపోయే కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రానికి ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ.44.50 కోట్ల నికర వసూళ్లు రాగా.. గ్రాస్ కలెక్షన్ రూ.52 కోట్లు దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వసూళ్లు నైట్ షోలు కాకుండా లెక్కించారు. నైట్ షోల కలెక్షన్లు కలిపితే ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో తమిళనాడు నుంచి 23 కోట్ల రూపాయలు, కర్ణాటక నుంచి 11 కోట్ల రూపాయలు, కేరళ నుంచి 5 కోట్ల రూపాయలు, ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 13 కోట్ల రూపాయలు వచ్చినట్లు ప్రకటించారు.
జైలర్ మూవీ తొలిరోజు ఓపెనింగ్ కలెక్షన్లతో ఇండియాలో అత్యధిక వసూళ్లు(collections) సాధించిన మూడవ చిత్రంగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ 89 కోట్లు, పఠాన్ 57 కోట్ల తర్వాత 2023లో ఓపెనింగ్ డే వసూళ్లు సాధించిన మూడో అతిపెద్ద చిత్రంగా రికార్డు సాధించింది. అంతేకాదు తమిళనాడులో అత్యధిక ఓపెనింగ్ డే గ్రాస్ కలెక్షన్లు(day 1 collections) సాధించిన మూవీగా రికార్డు సృష్టించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ మూవీ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilipkumar)రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ జైలర్ ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్‌గా నటించారు. ఈ సినిమాలో రమ్య కృష్ణన్, తమన్నా భాటియా, వినాయకన్, యోగి బాబు, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. దీనిని సన్ పిక్చర్స్ ఆధ్వర్యంలో కళానిధి మారన్ నిర్మించారు.