వీరప్పన్(Veerappan) పేరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఎర్రచందనం స్మగ్లర్‌గా వీరప్పన్ అందరికీ తెలిసిందే. ఆయన్ని పట్టుకునేందుకు తమిళనాడు(Tamilnadu) ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. వీరప్పన్‌ను పట్టుకునేందుకు ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు చేసింది. తాజాగా వీరప్పన్ నివసించే ప్రాంతాన్ని తమిళనాడు సర్కార్ టూరిస్ట్ స్పాట్(Tourist spot)గా మార్చనుంది. ఆయన నివశించిన గోపీనాథం(gopinaadham) అనే ప్రాంతంలో ప్రజల కోసం సఫారీలను ఏర్పాటు చేయాలని అటవీశాఖ భావిస్తోంది.
వీరప్పన్ నివశించిన ప్రాంతంలో డకాయిట్లు ఎక్కువగా ఉండేవారు. ఆ ప్రదేశంలోకి ప్రజలు, పోలీసులు కూడా వెళ్లడానికి భయపడుతుండేవారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అటవీ సిబ్బంది, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. వీరప్పన్ మరణించినప్పటి నుంచి ఆ ప్రదేశాలను చూడాలని చాలా మంది టూరిస్టులు(Tourist spot) ఎదురుచూస్తున్నారు. దానిని క్యాష్ చేసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ప్రస్తుతం వీరప్పన్(Veerappan) నివశించిన ఆ ప్రాంతాల్లోకి సఫారీలను అనుమతించాలని అటవీ శాక భావిస్తోంది. మైసూరు సర్కిల్లోని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ డాక్టర్ మాలతీప్రియ ఎమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. గోపీనాథం(gopinaadham)లో సఫారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు.