Pawan fans: పవన్ ఫ్యాన్స్ వార్నింగ్.. కొడాలి ఈసారి నువ్వు ఇంటికే!
ప్రస్తుతం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు చేస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఇక సినిమాలతో పాటు రాజకీయంగాను ఫుల్ బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. దీంతో పవన్ పై రాజకీయ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కొడాలి నానికి వార్నింగ్ ఇస్తున్నారు పవన్ ఫ్యాన్స్.
హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలన్నీ సెట్స్ పై ఉన్నాయి. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్నాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోంది. సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ మాఫియా బ్యాక్ డ్రాప్లో రాబోతోంది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తోంది. ఈ మూడు సినిమాల పై భారీ అంచనాలున్నాయి. అయితే ఓజి, ఉస్తాద్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుందే.. హరిహర వీరమల్లు మాత్రం డిలే అవుతూ వస్తోంది.
అయినా కూడా ఎట్టిపరిస్థితుల్లోను ఎలక్షన్స్ లోపు పవన్ ఈ సినిమాలను కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. తర్వాత పొలిటికల్ పై పూర్తిగా ఫోకస్ చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే వారాహి యాత్రతో రంగంలోకి దిగిపోయాడు పవన్. అయితే రీసెంట్గా బ్రో సినిమా రిలీజ్ అయిన సందర్భంగా రాంబాబు, శ్యాంబాబు మ్యాటర్ పొలిటికల్ హీట్ పెంచిన సంగతి తెలిసిందే. అలాగే పవన్ పై వైకాపా నాయకులు చేసే కామెంట్స్, విమర్శలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతునే ఉన్నాయి.
ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు పై రెచ్చిపోయి మాట్లాడాడు కొడాలి నాని. చంద్రబాబుకు మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్‌ను బట్టలూడదీసి రోడ్డు మీద నిలబెడతాం అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ కొడాలి పై మండిపడుతున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. కొడాలి బట్టలిప్పదీస్తుంటే పవన్ విప్పించుకుంటాడా.. ముందు నువ్వు గెలుస్తావో లేదో చూసుకో.. ఈసారి నువ్వు ఇంటికే కొడాలి.. ముందు నీ బట్టలు ఊడదియ్యకుండా చూసుకో.. పిచ్చిగా వాగితే అంతు చూస్తామని.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. అయినా కొడాలి ఇలా మాట్లాడడం కొత్తేం కాదు.. అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.