»Chiranjeevi Criticism Of Ap Politics Waltheru Veeraiah 200 Days Function
Chiranjeevi: సినిమాలపై కాదు..ప్రజాసేవపై దృష్టి పెట్టండి
వాల్తేరు వీరయ్య 200 ఆడిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో చిరంజీవి స్పందిస్తూ ఏపీ రాజకీయాలపై కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితిల్లో 200 డేస్ ఒక సినిమా ఆడటం అంటే మాములు విషయం కాదంటునే.. ఏపీ పాలకులు ప్రజల ఉపాధి, ప్రత్యేక హోదా గురించి పోరాడితే బాగుంటుందని సినిమా పరిశ్రమపై పడడం దేనికి అని చురకలు పెట్టారు.
Chiranjeevi criticism of AP politics, Waltheru Veeraiah 200 days function
Chiranjeevi: ఏపీ పాలకులు సినిమాల(Movies)పై కాకుండా ప్రజాపాలనపై దృష్టి పెడితే బాగుంటుందని చిరంజీవి వ్యాఖ్యనించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. భోళా శంకర్(BholaShankar) సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లలో వేగం పెంచారు. తాజాగా వాల్తేరు వీరయ్య(Vaaltair veerayya) 200 రోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం వేడుక చేసుకొంది. ఈవెంట్లో పాల్గొన్న చిరంజీవి(Chiranjeevi) సినిమా గురించి మాట్లాడుతునే ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య చోటుచేసుకున్న ఓ పరిణామంపై తనదైన రీతిలో స్పందించారు.
ప్రస్తుత రోజుల్లో ఎంత మంచి సినిమా అయినా సరే రెండు వారాలు ఆడితే అదే గొప్ప అన్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి సందర్భంలో వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజులు ప్రదర్శించడం అనేది మాములు విషయం కాదని, దానికి క్రెడిట్ అంతా దర్శక నిర్మాతలదే అని అన్నారు. ఈ సినిమా కోసం బాబీ(bobby) ఎంతగానో కష్టపడ్డారని ఆయన శ్రమకు దగ్గ ఫలితం దక్కిందన్నారు. అలాగే ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్క టెక్నిషన్కు ఆయన కృతజ్ఙతలు తెలిపారు. ఈ రోజుల్లో 200 రోజులు ఆడడం చూస్తుంటే ఆయన పాత సినిమాలు గుర్తుకొస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ వేడుకకు సంబంధించిన షీల్డ్ తీసుకుంటే ఒళ్లు పులకరిస్తుందని పేర్కొన్నారు.
అలాగే సినిమా పరిశ్రమపై చుట్టుముడుతున్న రాజకీయాల గురించి ప్రస్థావిస్తూ.. పాలకవర్గంలో ఉన్నవారు ప్రజలకు కావాల్సిన, నీళ్లు, ఉద్యోగాలు, ఉపాది గురించి మాట్లాడితే బాగుంటుందని, రాష్ట్ర అభివృద్ది, ప్రత్యేక హోదా లాంటి సమస్యలను ఒదిలేసి పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా పరిశ్రమపై పడితే ఎలాగని చురకలు అంటించారు. ఈ మాటలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతాయని నెటిజనులు భావిస్తున్నారు. తాజాగా విడుదల అయన బ్రో(BRO) సినిమాలో అంబటి రాంబాబును(Ambati Rambabu) పోలిన ఒక క్యారెక్టర్ విషయంలో జరిగిన వివాదం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి రాంబాబు మీడియా ముందు అవాక్కులు పేలిన విషయం తెలిసిందే.
చదవండి:KCR: తెలంగాణ అభివృద్ది లేదు, జాబ్స్ లేవు..దేశాన్ని పరుగులు పెట్టిస్తాడా?