»Heroine Neha Shetty Biography And Glamorous Photos
Neha shetty: బెడ్ పై పడుకున్న హీరోయిన్..గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?
DJ టిల్లు ఫేమ్ హీరోయిన్ నేహా శెట్టి ఈ మధ్య ఫుల్ గ్లామర్ షో చేస్తూ కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది. ఇటివల తన ఇన్ స్టా ఖాతాలో తన అందాలను చూపిస్తూ పలు వీడియోలు పోస్ట్ చేసిన ఈ బ్యూటీ దీంతోపాటు మరికొన్ని హాట్ చిత్రాలను కూడా పోస్ట్ చేసి అందాల కనువిందు చేస్తుంది. మరి అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
యంగ్ హీరోయిన్ నేహా శెట్టి ఫుల్ జోష్లో ఉంది. టాలీవుడ్లో వరుస సినిమా ప్రాజెక్టులు చేస్తూ దూసుకెళ్తుంది. ఇప్పటికే రూల్స్ రంజన్ మూవీలో యాక్ట్ చేస్తుండగా, మరోవైపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో విశ్వక్ సేన్ సరసన యాక్ట్ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ అమ్మడి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నేహా శెట్టి డిసెంబర్ 6, 1994న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. బెంగళూరులో చదువుతో పాటు మోడలింగ్ కూడా చేసింది. ఆమెకు మొదటి నుంచీ నటి కావాలనే కోరిక ఉండేది.
2014లో మోడలింగ్ చేస్తున్నప్పుడు, మిస్ మంగళూరు అందాల పోటీ షోలో పాల్గొంది. అక్కడ నగరంలోని పోటీదారులను ఓడించి మిస్ మంగళూరు టైటిల్ను గెలుచుకుంది.
2015లో మిస్ సౌత్ ఇండియా బ్యూటీ కాంపిటీషన్ షోలో పాల్గొన్న ఆమె ఈ బ్యూటీ కాంపిటీషన్ షోలో గెలిచిన తర్వాత పాపులర్ అయ్యింది.
నేహా చాలా మంచి డ్యాన్సర్ కూడా, ఆమె ప్రముఖ ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ ఎంఎస్ శ్రీధర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకుంది. 2016లో విడుదలైన కన్నడ చిత్రం ముంగారు మలే 2లో నందిని పాత్రను పోషించడం ద్వారా ఆమె సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
దీని తరువాత ఆమె 2018లో విడుదలైన పూరి జగన్నాథ్ యొక్క తెలుగు చిత్రం మెహబూబాలో కనిపించింది. దీంతోపాటు నేహా US వెళ్లి అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుంచి నటనలో శిక్షణ కూడా తీసుకుంది.
తర్వాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ఆ తర్వాత ఆమె 2021లో విడుదలైన తెలుగు చిత్రం గల్లీ రౌడీలో యాక్ట్ చేసింది.
2021లోనే విడుదలైన మరో తెలుగు చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లో మేఘా పాత్రను పోషించింది. 2022లో DJ టిల్లులో యాక్ట్ చేసి మంచి గుర్తింపు దక్కించుకుంది.