»Wife Killed His Husband Due To Extramarital Affair
Wife: కట్టుకున్నోడినే కడతేర్చింది.. భర్తను హతమార్చిన భార్య
ప్రియుడి మోజులో భర్త చంద్రశేఖర్‌ను హతమార్చింది భార్య భువనేశ్వరి. హత్య చేసి.. తనకు ఏమీ ఎరగనట్టు పోలీసులకు ఫోన్ చేసింది. సందేహాం కలిగి విచారిస్తే.. అసలు నిజం తెలిసింది.
Wife Killed His Husband Due To Extramarital Affair
Wife: మూడుముళ్లు వేయించుకొని, ఏడడుగులు నడిచి.. కడదాకా తోడుంటానని ప్రమాణం చేసిన భార్య దారితప్పింది. పెళ్లైన తర్వాత మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ రాసలీలలకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకుంది. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఈ ఘటన చిత్తూరు (chittoor) జిల్లాలో జరిగింది.
చంద్రగిరికి (chandragiri) చెందిన చంద్రశేఖర్‌కు (chandrashekar) భువనేశ్వరితో (bhuvaneshwari) పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలతో ఉంగుటూరు మండలం నారాయణపురం (narayanapuram) టూరింగ్ పేటలో ఉంటున్నారు. నారాయణపురంలో గల స్థానిక ఫ్యాక్టరీలో (factory) సూపర్ వైజర్‌గా చంద్రశేఖర్ పనిచేస్తున్నాడు. పెళ్లై.. భర్త ఉన్న.. భువనేశ్వరి ప్రవర్తనలో మార్పు వచ్చింది. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంపై భార్య భర్తల మధ్య గొడవ కూడా జరిగిందని తెలుస్తోంది.
తమకు అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. హత్య చేసిన తర్వాత.. కథ చెప్పింది. పోలీసులకు ఫోన్ చేసి భర్తపై దాడి చేశారని తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తమదైన శైలిలో విచారించారు. ఏం జరిగింది..? ఎవరూ వచ్చారు..? ఎలా జరిగిందనే ప్రశ్నలు గుప్పించగా చివరకు నేరాన్ని అంగీకరించింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేశానని ఒప్పుకుంది. భర్తను చంపి.. ఇద్దరు పిల్లలకు దూరమై, ప్రియుడితో పాటు కటకటల పాలయ్యింది భువనేశ్వరి.