జాతిరత్నాలు సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు దర్శకుడు అనుదీప్. దాంతో ఈ యంగ్ డైరెక్టర్ పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం తమిళ్ హీరో శివకార్తికేయన్‌తో ‘ప్రిన్స్’ అనే సినిమా చేస్తున్నాడు. అయితే రీసెంట్గా ఈయన కథ అందించిన సినిమా ఒకటి ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ సినిమా అనుదీప్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. జాతిరత్నలు తర్వాత అనుదీప్ అందించిన కథతో.. వంశీధర్ దర్శకత్వంలో.. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనే సినిమా వచ్చింది. దాంతో ఇది జాతి రత్నాలు తరహాలోనే.. మంచి ఎంటర్టైనర్ మూవీ అవుతుందని అనుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. ఈ సినిమాను అనుదీప్ సినిమానే అనుకున్నారు నెటిజన్స్. పైగా మెగాస్టార్ గెస్ట్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు.
దాంతో ఫస్ట్ డే ఫస్ట్ షో హైప్ క్రియేట్ చేసింది. కానీ ఈ సినిమా చూసిన ఆడియెన్స్.. ఇదేం సినిమారా బాబు అంటూ షో పూర్తవకుండానే బయటికెళ్లిపోతున్నారు. మొత్తంగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ ఆకట్టుకోలేకపోయిందంటున్నారు. ఇదే ఇప్పుడు అనుదీప్ పై కామెంట్ చేసేలా చేసింది. జాతిరత్నాలు సినిమాతో మాంచి పేరు తెచ్చుకున్న అనుదీప్.. తొందరపడి తన కథతో వేరే వాళ్ల డైరక్షన్లో ఈ సినిమా చేశాడని అంటున్నారు. అసలు అనుదీప్ ఏదో ఒక చిన్న సినిమా చేద్దాం అనే భ్రమలో ఈ సినిమా చేశాడా.. ఒకవేళ అలా చేస్తే మాత్రం అతనికిది పెద్ద డ్యామేజ్ అనే చెప్పాలి. అంతేకాదు అసలు జాతి రత్నాలు తీసిన అనుదీప్ ఇలాంటి కథతో రావడమేంటని అంటున్నారు. మరి కథ ఇచ్చి ఫెయిల్ అయిన అనుదీప్.. ‘ప్రిన్స్’ సినిమాతో డైరెక్టర్‌గా ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.