Four People Create Fake Certificates: సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ కలిసి ఫేక్ సర్టిపికెట్ (Fake Certificates) రూపొందించారు. ప్రభుత్వ పథకాలను పొందడానికి వారు సొంతంగా సర్టిఫికెట్ తయారు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, వారికి సహకరించిన వాలంటీర్ చొక్కాకుల నానాజీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర ప్రకంపనలు రేపుతోన్నాయి. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ ఫేక్ సర్టిఫికెట్స్ (Fake Certificates) అంశం రాజకీయాల్లో కాక రేపుతోంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఓ నలుగురు కలిసి.. తమ సర్టిఫికెట్స్ (Certificates) తయారు చేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఆరా తీయడంతో అసలు విషయం తెలిసింది.
సచివాలయంలో పనిచేస్తోన్న డిజిటల్ సహాయకుడు సుధీర్‌కు.. పెళ్లి కాలేదు. డిజిటల్ కీ ఉపయోగించి ఫేక్ మ్యారేజ్ సర్టిఫికెట్ (Fake Certificates) తీసుకున్నాడు. అదే సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీసులు ముగ్గురు కూడా విడాకులు తీసుకున్నట్టు సర్టిఫికెట్ తీసుకున్నారు. మహిళా పోలీసులు బురుగు, బెల్లి రాజేశ్వరి, పైలా వెంకటలక్ష్మీ తమ భర్తలతో కలిసి ఉంటున్నారు. కానీ విడాకులు తీసుకున్నామని చెప్పి.. తప్పుడు పత్రాలు తయారు చేసుకున్నారు.
ఏపీలో ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసిన సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ అరెస్ట్
ప్రభుత్వ పథకాలను పొందడానికి ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేయడంతో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, ఓ వాలంటీరును పోలీసులు అరెస్టు చేశారు.
ఇలా నలుగురు కలిసి ఏపీ ప్రభుత్వాన్ని (andhra pradesh government) మోసం చేశారు. ప్రభుత్వ పథకాలను పొందుతున్నారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని వివరించారు.