»Ambati Rambabu Strong Warning To Trivikram Effect On Guntur Karam Movie
Ambati rambabu: త్రివిక్రమ్‌కి అంబటి గట్టి వార్నింగ్..గుంటూరు కారంపై ఎఫెక్ట్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం బ్రోలో కమెడియన్ పృథ్వీ శ్యాంబాబు పాత్ర ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్యారెక్టర్ పై వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు ఈ మూవీకి డైలాగ్స్ అందించిన త్రివిక్రమ్‌కు వార్నింగ్ కూడా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మంత్రుల పరువు తీసేలా సినిమాలను ఉపయోగిస్తే టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ వైసీపీ మంత్రి అంబటి రాంబాబు(ambati rambabu) హెచ్చరించారు. అంబటిని తలపించే శ్యామ్‌బాబు పాత్రలో పృధ్వి నటించిన ‘బ్రో’ చిత్రంలోలో ఆయనకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగులు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. డైలాగులు చాకచక్యంగా ఉన్నప్పటికీ, ఈ వ్యూహాల వెనుక ఎవరున్నారో తెలుసునని అంబటి పేర్కొన్నారు. దమ్ముంటే డైరెక్ట్ పొలిటికల్ సినిమాలు తీయాలని, కుటిల వ్యాఖ్యలు ఎందుకని ఎద్దేవా చేశారు. నేరుగా రాంబాబు పేరు పెట్టేటపుడు శ్యామ్ బాబు పేరు ఎందుకు పెడతారంటూ త్రివిక్రమ్(Trivikram)పై మండిపడ్డారు. రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులు మరోసారి ఇలాంటి ఎత్తుగడలు వేస్తే తగిన గుణపాఠం చెబుతామని అంబటి స్పష్టం చేశారు.
అయితే ఆ క్యారెక్టర్ అంబటి(ambati)ని పోలి ఉంటుందనడంలో ఎవరికీ సందేహం లేదు. ఈ ప్రచారాన్ని చిత్రబృందం కొట్టిపారేసినా.అంబటిని టార్గెట్ చేసే పాత్ర అని ప్రేక్షకులు నమ్ముతున్నారు. అంబటి కూడా ఈ పాత్రపై తొలుత సరదాగా వ్యంగ్యంగా స్పందించారు. అయితే తర్వాత మనసు మార్చుకున్న అంబటి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి బ్రో టీమ్ తో పాటు పవన్ కళ్యాణ్ ని కాస్త గట్టిగానే టార్గెట్ చేశాడు. బ్రో సినిమా డిజాస్టర్ అయ్యిందని ప్రెస్ మీట్ పెట్టి సినిమా కలెక్షన్స్ వివరాలపై ప్రస్తావించారు.
అంతటితో ఆగకుండా పవన్(pawan kalyan) వ్యక్తిగత జీవితం, పెళ్లిళ్లపై మరోసారి విమర్శలు గుప్పించిన అంబటి.. తాము కూడా కథలు రాయబోతున్నామని, సినిమాలు తీయబోతున్నామని ప్రకటించారు. నిత్య పెళ్లికొడుకు, తాలి ఎగతాళి.. ఇలా ఎన్నో టైటిల్స్ కూడా పరిశీలనలో ఉండగా అంబటి కూడా ప్రెస్ మీట్ లో తమ డిజైన్లను ప్రదర్శించడం విశేషం. మరోవైపు తనను టార్గెట్ చేస్తూ మళ్లీ అలాంటి పాత్రలు సృష్టిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అంబటి హెచ్చరించటం గమనార్హం.
ఈ నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకుంటానని అంబటి ఆరోపించారు. అంటే త్రివిక్రమ్ తదుపరి చిత్రం గుంటూరు కారం(Guntur Karam)పై ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందా? సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది చూడాలి.