బ్రో సినిమాలో తనను అవమానించేలా సీన్లు ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) చేసిన వ్యాఖ్యలపై హీరో సాయిధరమ్ తేజ్ స్పందించారు. ‘అంబటిపై జోకులు వేసే ఉద్దేశంతో ఆ సీన్ తీయలేదు. సినిమాని సినిమా(Movie)గానే చూడండి. మూవీని రాజకీయాలతో ముడిపెట్టొద్దు. నాకు రాజకీయ అనుభవం లేదు. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు’ అని స్పష్టం చేశారు.
తమ కుటుంబ సభ్యులందరూ మామయ్య పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు సపోర్ట్ చేస్తామని తేజూ చెప్పాడు. ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని సాయితేజ్ దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.పెద్ద మామయ్య చిరంజీవి(Chiranjeevi)తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక షార్ట్ ఫిలిం చేశామని… దాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15న విడుదల చేస్తామని తెలిపాడు.