టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పెట్టుకున్న ఇయర్‌బడ్స్‌పై ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. మోడల్ పేరు ఏంటి? ధర ఎంత? వంటి వివరాలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది మీకోసమే..Beats Powerbeats Pro TWS earbuds : వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. తాజాగా యాపిల్ ఇయర్‌బడ్స్ (Apple Earbuds)పెట్టుకుని కనిపించాడు.ఆ ఇయర్‌బడ్స్ ఏంటి? ధర ఎంత? వంటి అంశాలపై అతని ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. అయితే.. ఈ ఇయర్‌బడ్స్ భారత్‌లో అందుబాటులో ఉండవు కరీబియన్ దీవుల్లో ఉన్న విరాట్ కోహ్లీ.. వెస్టిండీస్ (West Indies) వికెట్ కీపర్ జాషువా డా సిల్వా తల్లిని కలిశాడు. విరాట్‌ను చూసిన ఆమె, చాలా సంతోషించింది. ఈ వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే.. ఇందులో విరాట్ పెట్టుకున్న స్టైలిష్ ఇయర్‌బడ్స్‌పై ఫ్యాన్స్ ఫోకస్ చేశారు.
సాధారణంగా క్రికెటర్లు,సెలబ్రిటీలు యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో, యాపిల్ ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్ వంటి మోడల్స్‌ను వాడుతుంటారు. కానీ అందుకు విరుద్ధంగా.. ఈసారి విరాట్ కోహ్లీ.. బీట్స్ పవర్‌బీట్స్ (Beats Powerbeats) ప్రో టీడబ్ల్యూఎస్ ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని కనిపించాడు. యాపిల్ స్టోర్‌లో దీని ధర 249.95 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 20వేలు. అయితే ఇది ఇండియాలో అందుబాటులో లేదు!ఇవి యూఎస్ మార్కెట్లోని ఆపిల్ స్టోర్లలో లేదా అమెజాన్ (Amazon)వంటి ఆన్లైన్ సెక్టార్లలో మాత్రమే లభిస్తాయి.బీట్స్ పవర్ బీట్స్ ప్రో మోడల్లో అడ్జెస్టెబుల్ ఇయర్ హుక్స్ ఉంటాయి. దీంతో ఎక్కువ కంఫర్ట్ లభిస్తుంది. పవర్‌బీట్స్ ప్రో మొదటి సారి 2018లో ప్రారంభమైంది. దీని లేటెస్ట్ వెర్షన్ (Latest version) నవంబర్ 2022లో విడుదలైంది.