Pawan Kalyan: పవర్ స్టార్ అదిరిపోయే గిఫ్ట్.. OG టీజర్ లోడింగ్!
ప్రస్తుతం థియేటర్లో బ్రో హవా నడుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ మెగా మల్టీస్టారర్ మూవీ.. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. పవర్ స్టైల్, వింటేజ్ వైబ్స్‌తో పండగ చేసుకుంటున్నారు మెగాభిమానులు. ఇక ఈ సినిమా తర్వాత అసలు సిసలైన సినిమా రాబోతోంది. అదే ఓజి.. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. అందుకే ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో ఓజి టీజర్ బజ్ వైరల్ అవుతోంది.
బ్రో సినిమా ఎలాగు రిలీజ్ అయిపోయింది కాబట్టి.. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి.. ఈ సినిమాలన్ని సెట్స్ పై ఉన్నాయి. వీటలో ఓజి ఓవర్ స్పీడ్‌తో మిగతా ప్రాజెక్ట్‌ని ఓవర్టేక్ చేసేసింది. అందుకే ఈ సినిమాలన్నింటిలోను ఓజి పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సాహో తర్వాత పవర్ ఫుల్ గ్యాంగ్ డ్రామాగా ముంబై బ్యాక్ డ్రాప్లో ఓజి రాబోతోంది. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసేశారు.
ఇప్పటి వరకు ఓజి నుంచి బయటికొచ్చిన పవన్ లుక్కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. పవర్ ఫుల్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కనిపించనున్నాడు. ఇలాంటి ఓజి నుంచి ఒక్క టీజర్ బయటికొస్తే చాలు.. రికార్డులు లేస్తాయ్ అని అంటున్నారు. ఇప్పుడా సమయం రానే వస్తోందని అంటున్నారు. మరో నెల రోజుల్లో ఓజి నుంచి సాలిడ్ అప్డేట్ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈసారి పవన్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న ఓజి నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
లేదంటే టీజరే వదిలే ఛాన్స్ ఉందని అంటున్నారు. అదే జరిగితే ఇప్పటి వరకున్న రికార్డులన్నీ జాగ్రత్త మావా అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇక ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది ఓజి. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.