తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు (Heavy Rains) అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ(Telangana)లో కొన్ని ప్రాంతాలు వరదలతో నష్టాల బారిన పడ్డాయి. కొన్నిచోట్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalapalli District)లో భారీ వరదలు సంభవించాయి. ఈ వరదలకు మోరంచవాగు పొంగింది. దీంతో మోరంచపల్లి (Moranchapalli) గ్రామం మొత్తం వరదలో మునిగింది. గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయం కోసం ఎదురుచూడగా ప్రభుత్వ యంత్రాంగం హెలికాప్టర్లు, బోట్ల సాయంతో గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
వరదల (Floods) బీభత్సానికి చాలా మంది కొట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. తాజాగా మోరంచవాగు వరద తగ్గింది. అయితే ఆ వాగు నుంచి మృతదేహాలు (Deadbodies) ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి. ఇప్పటి వరకూ 11 మంది మృతదేహాలు (11 died) బయటపడటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. కన్నీటి రోదనల మధ్య ఆ ప్రాంతం మొత్తం ఆర్తనాదాలతో నిండిపోయింది.
మోరంచపల్లి గ్రామం(Moranchapalli)లో ఇప్పటి వరకూ 153 బర్రెలు, 753 కోళ్లు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మరో 50 గొర్రెలు నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా, జాతీయ రహదారి (High way Road) సైతం చెదిరిపోయింది. గ్రామంలోని ప్రజలు మృత్యువాత పడటంతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమవుతున్నారు. అధికార యంత్రాంగం గ్రామంలో సహాయక చర్యలు చేపడుతోంది.