టీమిండియా (Team India) యువ క్రికెటర్లకు ఛాన్స్ ఇవ్వడానికి సీనియర్లు రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli) వారి స్థానాలను త్యాగం చేశారు.యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇదే విషయంపై రోహిత్ శర్మ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో జట్టును సమాయత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఎక్కువగా అవకాశాలు వస్తాయని చెప్పలేను కానీ.. వీలుచిక్కినప్పుడల్లా ఆడిస్తాం.
ఇక నేను ఏడో స్థానంలో రావడంపై చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. నాకు ఇదేమీ కొత్త స్థానం కాదు. నేను అరంగేట్రం చేసినప్పుడు ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడిని. ఇప్పుడు ఆ రోజులు మళ్లీ గుర్తుకు వచ్చాయిని రోహిత్ తెలిపాడు. ముకేశ్ కుమార్ (Mukesh Kumar) రెండు వైపులా అద్భుతంగా స్వింగ్ చేయగలిగాడు. మా ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ సూపర్‌గా ఆడాడు’’ అని రోహిత్ వెల్లడించాడు.వెస్టిండీస్(West Indies)పై మూడు వన్డేల (WI vs IND) సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. అయితే.. స్వల్ప స్కోరుకే ప్రత్యర్థిని తొలుత కట్టడి చేయడంతో.. టీమ్ఇండియా ప్రయోగాలు చేసింది.