సీఎం కేసీఆర్ (CM KCR)పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు.రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం రైతులని నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు . రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ (Shad Nagar) పట్టణం లో ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈటల. ఈ సందర్బంగా మాట్లడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరాకి అయిదు వేల రూపాయలు రైతుబంధు ఇస్తూ మరొకవైపు రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలను ఎత్తివేసి వారి నడ్డి విరుస్తుందన్నారు.
పంట నష్టం కింద ఎకరాకి పది వేల రూపాయలు సహాయం చేస్తా అన్న కెసిఆర్ హామీ నేటి కి అమలు కాలేదని విమర్శించారు. రాష్ట్రం లో కౌలు రైతులకు రూపాయి సహాయం చెయ్యని ముఖ్యమంత్రి పంజాబ్ రైతులకు (farmers) రాష్ట్ర ధనాన్ని అప్పనంగా పంచి పెట్టారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.ధరణి పేరు చెప్పి ఇప్పుడు కెసిఆర్, ఆయన బంధువులు, తాబేదారులు 50 ఏళ్ల కింద కొనుక్కున్న రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. కేసిఆర్ ఎల్లకాలం నీ రాజ్యం నడవదని, మట్టిని నమ్ముకున్న రైతుల జోలికొస్తే నీ భరతం పడతామని ఈటల రాజేందర్ హెచ్చరించారు