KKD: శంఖవరంలోని ఏపీ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వీర్రాజు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరానికి గానూ ఈనెల 25వ తేదీ నుంచి 31వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.