»Lakshmi Parvathi Satires On Lokesh And Pawan Kalyan On Alludu Suddulu Book
Lakshmi Parvathi: లోకేష్, పవన్ కళ్యాణ్ పై సెటైర్లు
నారా లోకేష్, పవన్కల్యాణ్లతోపాటు చంద్రబాబు నాయుడు ప్రవర్తన ప్రజలకు తెలియజేసేందుకే తాను ‘అల్లుడు సుద్దులు’ పుస్తకం రాశానని లక్ష్మీ పార్వతి తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ దుర్మార్గులైన నారా లోకేష్, పవన్ కల్యాణ్(pawan kalyan), తన అల్లుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ గురించి ప్రజలకు తెలియజేసేందుకే తాను ‘అల్లుడు సుద్దులు’ అనే బుక్ రాశానని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి(lakshmi parvathi) అన్నారు. సత్యనారాయణపురంలో మంగళవారం జరిగిన ‘అల్లుడు సుద్దులు’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న సీరియస్ పొలిటికల్ డ్రామాలో లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరు కామెడీ పాత్రదారులని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు.
ఈ పొలిటికల్ సెటైర్లో తెలుగులో అది కూడా చిత్తూరు యాసలో తనకు వ్యక్తిగతంగా నచ్చినట్లుగా ఈ పుస్తకం(book)లో రాశానని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ఆ జిల్లాకు చెందిన వ్యక్తి కావడం వల్ల, తాను ఎంత వరకు సఫలీకృతం అయ్యానో తెలియడం లేదన్నారు. ఎవరి మనోభావాలు కించపరచకుండా సెటైర్ రాయడం ఎంత కష్టమో లక్ష్మీపార్వతి వివరిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాడుపై 26 ఏళ్లుగా తాను చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఇది దాదాపు పిల్లి, ఎలుకల పోరాటం లాంటిదని వ్యాఖ్యానించారు. తాను అతనికి వ్యతిరేకంగా చాలాసార్లు సీరియస్‌గా రాశాను. కానీ కామెడీ నా మాటను ప్రజలకు చేరుస్తుందని తాను అనుకుంటున్నట్లు పుస్తకంలో ప్రస్తావించారు.
ఈ పుస్తకంలో తన కథానాయకులు ఇద్దరు అనర్హులని రాజకీయాల్లోకి తీసుకొచ్చి బలవంతంగా ప్రజలు కోరుకోని నాయకులను చేశారని ఆమె అన్నారు. లోకేశ్(lokesh)ను చూడు, అతని ప్రవర్తన కమెడియన్లా ఉంది. అతను అసభ్యంగా మాట్లాడుతున్నాడు. అతని చేష్టలను నా పుస్తకంలో డాక్యుమెంట్ చేసానని అన్నారు. తనకు అనుభవం లేదని, ప్రజల చేత ఎన్నుకోబడలేదని, మంత్రిని ఎలా చేస్తారని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు(ambati rambabu) రాజకీయ వ్యంగ్య రచనలో లక్ష్మీపార్వతి చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ పుస్తకాన్ని చదవాలని కోరారు. చంద్రబాబు నాయుడిని చాలా దగ్గరగా చూసిన కొద్దిమంది వ్యక్తులలో ఈమె ఒకరని, అతని గురించి బాగా తెలుసు కాబట్టి ఈ బుక్ చంద్రబాబు గురించి ఇచ్చిన మొదటి సమాచారం అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.