హైదరాబాద్(Hyderabad)లో పలుచోట్ల భారీగా వర్షం దంచి కొట్టింది. అరగంట సేపు కుంభవృష్టి వాన కురిసింది. దీంతో నగరంలో పలు చోట్ల అధిక వర్షపాతం నమోదు అయింది. మలక్పేట(Malakpet)లో రికార్డు స్థాయిలో 4.7 సెం.మీ వర్షం పాతం నమోదు అయింది. సరూర్నగర్లో 4 సెం.మీ, ఎల్బీనగర్-3.65 సెం.మీ, మెహిదీపట్నంలో 3.58 సెం.మీ, రాజేంద్రనగర్లో 4.05 సెం.మీ, సికింద్రాబాద్-3.98 సెం.మీ. అంబర్పేట్ 3.93 సెంమీ, చందానగర్లో 4.2 సెం.మీ, జూబ్లీహిల్స్ 3.55 సెం.మీ,
మూసాపేట్ 3.8 సెం.మీ, గోషామహల్ 3.7 సెం.మీ, సంతోష్ నగర్లో 4.2 సెం.మీ, హయత్నగర్ 3.6 సెం.మీ, కార్వాన్ 3.9 సెంమీ, చార్మినార్ 4.7 సెం.మీ, మియాపూర్లో 4.2 సెం.మీ, సనత్ నగర్ 4.1 సెం.మీ, లంగర్ హౌస్ 3.9 సెం.మీ, బంజారాహిల్స్(Banjara Hills) , విజయనగర్ కాలనీలో 3.5 సెం.మీ, లింగోజిగూడలో 4.4 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదు అయింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల వేళల్లో మార్పులు చేసింది. రేపటి నుండి ఉదయం గం.9.30 నుండి సాయంత్రం గం.4.15 వరకు ప్రాథమిక పాఠశాలలు, ఉదయం గం.9.30 నుండి సాయంత్రం గం.4.45 వరకు ఉన్నత పాఠశాలలు(schools)పని చేస్తాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్(Hyderabad), సికింద్రాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ వేళల్లో మార్పులు చేశారు.