Do you know why you can't quit smoking? This is the scientific reason behind it
Smoking: ధూమపానం(Smoking), మద్యపానం(Drinking) ఆరోగ్యానికి హానికరం అనే విషయం అందరికీ తెలిసిందే. సినిమా థియేటర్లు వెళ్లినా, టీవీలో ఏదైనా పొగతాగే సీన్ వచ్చినా ఈ హెచ్చరిక అయితే కచ్చితంగా ఉంటుంది. అయినా సరే ఎవరు మానేయ్యడానికి ఇష్టపడరు. ఏదో సరదాగా మొదలైన అలవాటు తరువాత వ్యసనంగా మారుతోంది. ఇక వదిలేయాలన్నా కష్టంగా ఉంటుంది. దీనికి ఓ బలమైన కారణమే ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అసలు సిగరెట్(Cigarette) అలవాటును ఎందుకు వదులుకోలేరన్న దానిపై పరిశోధనలు నిర్వహించారు. ఆస్ట్రేలియాలో చేపట్టిన ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
60 నుంచి 75 శాతం మంది ప్రజలు ధూమపానం మానేసినా 6 నెలల్లోపే తిరిగి ప్రారంభిస్తారని ఆస్ట్రేలియా(Australia)లోని ఒక అధ్యయనంలో వెల్లడైంది. సిగరెట్ కు అడిక్ట్(Addicted to cigarettes) అవడం వెనుక ఓ సైన్స్ దాగి ఉంది. మాములుగా పొగాకులో నికోటిన్(Nicotine) ఉంటుంది అని అందరికి తెలుసు. పొగ పీల్చినప్పుడు అది రక్తం ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. తరువాత ఆ నికోటిన్ మెదడుకు వెళ్తుంది. ఎసిటైల్కోలిన్ రిసెప్టర్‌ను నికోటిన్ ప్రేరేపిస్తుంది. ఇందులోని ఉత్తేజిత గ్రాహకాలు న్యూరోట్రాన్స్మిటర్ డోపమైన్‌ను విడుదల చేస్తాయి. దీనిద్వారా శరీరం కొంత తేలికగా అనిపిస్తుంది. క్రమంగా మానవ బాడీ దీనికి అలవాటు పడటంతో సిగరేట్ మానయ్యలేరు అంటున్నారు.
డొపమైన్(Dopamine) కూడా ఒకరకమైన హార్మోన్. స్మోకింగ్ చేసినప్పుడల్లా శరీరంలో డోపమైన్ విడుదలైనప్పుడల్లా ఒక ఉత్సాహాం వస్తుంది. అదియే మళ్లీ సిగరేట్ తాగేలా ప్రేరెేపిస్తుంది. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా స్మోకింగ్ మరణాలకు కారణంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 14 శాతం మరణాలకు ధూమపానం కారణంగా మారుతుందని తేలింది. సిగరెట్ తాగడం అనేది ప్రపంచంలో ఒక ట్రెండ్‌గా మారిందని, దీని పరిధి పెరుగుతోందని కొన్ని గత పరిశోధనలు చెబుతున్నాయి. అయితే సిగరేట్ అలవాటు ఉన్నవాల్లు మానయ్యేలంటే వైద్యనిపుణుడి సలహాలు, కౌన్సిలింగ్ అవసరమని తెలిపారు. అలా సరైన గైడెన్స్ తో ఒక 6 నెలల లోపు పొగను మానేయ్యడానికి ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు వివరించారు.