An interesting incident in the Parliament.. Modi went to Sonia and greeted her very much
PM Modi: పార్లమెంట్ వర్షకాల(Parliament Monsoon) సమావేశాలు ఈరోజు ప్రారంభం అయ్యాయి. రాజకీయంగా ప్రత్యర్ధులుగా ఉన్నప్పటికి, ప్రధాని మోడీ మానవత్వం చాటుకున్నారు అని దేశం అనుకునేలా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. దేశ ప్రధాని నరేంద్రమోడీ(Narendra Modi), కాంగ్రెస్(Congress) పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi) మధ్య కొంత సంభాషణ కొనసాగింది. మోడీయో స్వయంగా సోనియా కూర్చున్న చోటుకి వెళ్లి ఆమెను పలకరించారు. ఆమె ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. బుధవారం సోనియా ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ సాంకేతిక లోపం కారణంగా భోపాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఆ కారణం చేతనే సోనియా ఆరోగ్యం గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు.
అయితే తాను బాగానే ఉన్నానని మోదీకి సోనియా బదులిచ్చారు. బుధవారం రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఖాతలో చార్టెడ్ ఫ్లైట్ లో ఆక్సీజన్ మాస్క్ పెట్టుకుని ఉన్న సోనియా గాంధీ ఫొటో చేశారు. అనంతరం ఇంత ఒత్తిడిలోనూ చాలా దయతో ఉన్నారు అనే అర్థంలో పోస్టు పెట్టారు. విపక్షాల సమావేశం కోసం బెంగళూరు వచ్చిన సోనియా తిరిగి ఢిల్లీ వెళ్తుండగా చార్టెడ్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అనంతరం బుధవారం రాత్రి 9:30 గంటలకు అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరారు.
వర్షాకాల సమావేశాల తొలిరోజు అన్ని పార్టీల ఎంపీలు పార్లమెంటుకు హాజరయ్యారు. ముఖ్యంగా ఈశాన్యరాష్ట్రం మణిపూర్(Manipur) జరుగుతున్న హింసాకాండపై ప్రధాని స్పందించాలని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. విపక్షాల కూటమి ‘ఇండియా’(INDIA) తన ఐకమత్యాన్ని చాటుకోవడానికి ఈసారి పార్లమెంట్ సమావేశాలను ఆస్త్రంగా ఉపయోగించుకోనున్నాయి. అందుకే అన్ని పార్టీలు ఒకతాటిపై వచ్చి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గట్టిగా నలిదీస్తున్నాయి.