ట్రాఫిక్ నియమాలు పాటించమని అధికారులు చెబుతున్నా వాహనదారుల్లో ఎటువంటి మార్పు రాలేదు. ముఖ్యంగా యువతలో కొందరు హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు. బైక్ రైడింగ్ చేస్తూనే యువ జంటల రొమాన్స్(Bike Romance) చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఢిల్లీలో చోటుచేసుకుంది. ఓ యువ జంట బైక్ పై రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది.
బైక్ నడుపుతూ ఆ జంట పబ్లిక్ గా చేసిన పని ఇప్పుడు పలువురికి ఆగ్రహం తెప్పిస్తోంది. బైక్ ట్యాంక్ పై కూర్చున్న ఓ అమ్మాయి రైడింగ్ చేస్తున్న అబ్బాయిని హగ్ చేసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు ఫ్లైఓవర్ పై వెళ్తున్న ఆ జంటను అటు వైపు వెళ్తున్న వారు వీడియో తీశారు. గాఢంగా హత్తుకుని బైక్ పై ఎంజాయ్ చేస్తున్న ఆ జంట ఎవర్నీ లెక్క చేయలేదు.
సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఆ వ్యక్తుల సమాచారాన్ని చెప్పినందుకు పోలీసులు థ్యాంక్స్ చెప్పారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు సెంటినల్ యాప్‌కు ఇటువంటి ఘటనల గురించి తెలియజేయాలని కోరారు. ప్రస్తుతం బైక్ పై యువ జంట రొమాన్స్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.