కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ నేత, కేరళ (Kerala) మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ (Oommen Chandy) కన్నుమూశారు. 79 ఏండ్ల ఊమెన్ చాందీ గత కొంతకాలంగా క్యాన్సర్తో (Cancer) బాధపడుతున్నారు. దీంతో బెంగళూరులోని ఆసుపత్రి ఓ చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు చాందీ ఊమెన్ (Chandy Oommen) ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.ఊమెన్ చాందీ గతంలో గొంతు సమస్యలకు ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం, మెరుగైన చికిత్స కోసం మరో ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
వరుసగా 12 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఊమెన్ చాందీ 1943 అక్టోబర్ 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ (Kumarakom) గ్రామంలో జన్మించారు. సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. నిజాయితీ, నిబద్ధత గల వ్యక్తిత్వంతో పార్టీ అధిష్టానానికి సన్నిహితుడిగా మారారు. 1970లో ఊమెన్ చాందీ తనకు 27 ఏళ్ల వయసులో తొలిసారిగా పూతుపల్లి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అది మొదలు ఆయన విజయయాత్ర అప్రతిహతంగా సాగింది. అదే నియోజకవర్గానికి ఏకంగా 12 సార్లే ఎమ్మెల్యేగా సేవలందించారు. 1977లో కె.కరుణాకరన్ (Karunakaran) క్యాబినేట్లో తొలిసారిగా చాందీకి మంత్రి పదవి దక్కింది. 2004-06, 2011-16 మధ్య కాలంలో ఆయనను సీఎం సీటూ వరించింది.