వింబుల్డన్ మహిళ సింగిల్స్(Wimbledon women’s singles) విజేత ఎవరో తెలిసిపోయింది. చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి వొండ్రుసోవా విజేతగా నిలిచింది. వింబుల్డన్ మహిళల సింగిల్స్ లో మొదటి నుంచి వొండ్రుసోవా నిలకడగా ఆడుతూ వచ్చింది. తాజాగా తన ప్రత్యర్థి అయిన టునీషియాకు చెందిన జాబెర్ పై విజయం సాధించింది. మొదటి రెండు సెట్స్‌లో 6-4, 6-4 పాయింట్ల తేడాతో వొండ్రుసోవా ఘన విజయాన్ని నెలకొల్పింది.
గ్రాండ్ స్లామ్లో తన ఖాతాను ఓపెన్ చేసింది. అయితే ప్రత్యర్థి జాబెర్ కూడా ఇప్పటి వరకూ రెండు సార్లు ఫైనల్ కు దూసుకొచ్చింది. అయినా ఫలితం లేదు. తాజా మ్యాచ్ లో ఆమె వొండ్రుసోవాతో తలపడి అపజయం పొందింది.